పైరసీలో కూడా పూజోభ్యహా!!

Update: 2017-07-01 08:57 GMT
అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హైలైట్ గా నిలిచిన అంశాల్లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉంది. తెలుగులో ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించినా వాటిలో ఆమెది హోమ్లీ క్యారెక్టర్ కావడంతో ఆమెలోని గ్లామర్ వెలుగులోకి రాలేదు. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హద్దులేమీ పెట్టుకోకుండా అందాలు ఆసాంతం ఆరబోసేయడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ సినిమా తర్వాత యూత్ లో పూజకు క్రేజ్ బాగానే పెరిగింది.

మిగిలిన అన్ని సినిమాల్లాగే దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు పైరసీ కష్టాలు తక్కువేమీ లేవు. ఈ సినిమా పైరసీపై ఇప్పటికే నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ లో సినిమా పైరసీ క్లిప్స్ సర్క్యులేట్ కాకుండా బ్రేక్ వేయొచ్చు. కానీ వాట్సాప్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా చేతులెత్తేయాల్సిందే. ఎవరు, ఎవరికి షేర్ చేస్తున్నారనేది చెప్పడం చాలా కష్టం. ఒక పోస్టు లక్షల మంది షేరింగ్ చేస్తుంటారు.  ట్రైలర్ - టీజర్ లో సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ మ్యానరిజం... డైలాగులు వంటివన్నీ బయటికొచ్చాయి. ఇప్పడు కొత్తగా ఏం షేర్ చేస్తున్నారంటే పూజా హెగ్డే బికినీ సీన్ వైరల్ గా మారింది. స్విమ్మింగ్ పూల్ లో నుంచి సింగిల్ పీస్ కాస్ట్యూమ్ లో ఆమె బయటకొచ్చిన సీన్ ను సినిమాలో బ్లర్ చేసినప్పటికీ యూత్, మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఆ సీన్ కు బాగా కనెక్ట్ అయిపోయారు. వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కువగా షేర్ అవుతోంది ఈ క్లిప్పింగే. దీనికి ‘పూజోదయం’ ‘పూజా.. పూజస్య.. పూజోభ్య:’ అంటూ టైటిల్స్ పెట్టి మరీ షేర్ చేస్తున్నారు.

ఈ తరహా చిత్రాలను షేర్ చేయడం చట్ట ప్రకారం తప్పయినప్పటికీ షేరింగ్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఎవరో కొంతమంది ఇలాంటి క్లిప్పింగులను చూసినా తిరిగి షేర్ చేయకుండా ఛైన్ కు బ్రేకులు వేస్తున్నారు. కానీ చాలామంది పూజ హెగ్డే అందాలను చూసి లొట్టలేసుకుంటూ బికినీ సీన్ ను మహా ఆనందంగా షేర్ చేసేస్తున్నారు. అలా చేయడం తప్పు బాసూ. ఆపేయండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News