స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో సక్సెస్ సాధించి దాదాపు ఐదు నెలలు పూర్తవుతోంది. రీసెంట్ గానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాని అనౌన్స్ చేశాడు బన్నీ. హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాధం టైటిల్ పై బన్నీ నటించనున్న మూవీలో.. హీరోయిన్ వేట కూడా ఓ కొలిక్కి వచ్చేసింది. ముకుందలో గోపికగా కనిపించి.. మొహెంజొదారోలో చానిగా అలరించిన పూజా హెగ్డేని.. బన్నీకి జోడీగా ఖాయం చేశారు. ఆరేళ్ల క్రితమే మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఈమెకి ఫిట్నెస్ పై బాగా మక్కువ.
రెగ్యలర్ గా చేసే వర్కవుట్స్ కాకుండా.. రీసెంట్ గా ఏరియల్ సిల్క్ ని పూజా హెగ్డే తెగ ప్రాక్టీస్ చేసేస్తోంది. ఎటువంటి సేఫ్టీ రోప్స్ లేకుండా.. కేవలం ఓ క్లాత్ ను పట్టుకుని వేళ్లాడుతూ విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా అప్పర్ బాడీకి బాగా స్ట్రెంగ్త్ చేకూరుతుంది. అలాగే మెలికలు తిరిగేందుకు కూడా హెల్త్ అవుతుంది. అందుకే ఏరియల్ సిల్క్ ని తెగ ప్రాక్టీస్ చేసేస్తోంది పూజా.
'ఇంటర్నేషనల్ సింగర్ పింక్ నుంచి స్ఫూర్తి పొంది ఇది నేర్చుకున్నా. నాకు హైట్ అంటే భయం. పైగా నేను అంత ఫ్లెక్సిబుల్ కాదు. అయితే.. భయం అలాగే ఉంది కానీ.. ఇప్పుడు నేను ఫిట్నెస్ లెవెల్ ని మాత్రం పెంచుకోగలిగా' అంటోంది పూజా హెగ్డే.