పూనమ్‌ ఎందుకు మిస్సయ్యింది?

Update: 2015-07-05 08:29 GMT
వైజాగ్‌ అమ్మాయి, తెలుగమ్మాయి పూనమ్‌ బజ్వా.. టాలీవుడ్‌లో ఎందుకు స్థిరపడలేకపోయింది? అందం ఉంది. ఒడ్డు పొడుగు ఉంది. కానీ లోపం ఎక్కడ? ఈ అమ్మడి నటన, అభినయం మనవాళ్లకు నచ్చలేదా? అదృష్టం కలిసి రాలేదా? కారణం ఏదైనా టాలీవుడ్‌ నుంచి ఈ అమ్మడు మిస్సయ్యి చాలా కాలమే అయ్యింది. అడపాదడపా కన్నడ, మలయాళ చిత్రాల్లో, తమిళంలో కనిపిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆరణ్మయి 2 చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రలో నటించానని చెప్పింది.

అంతేనా రెగ్యులర్‌గా తమిళ చిత్రాల్లో ఎందుకు నటించడం లేదు? అన్న ప్రశ్నకు ఓ ఆసక్తికర సమాధానం చెప్పింది అమ్మడు. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రపంచమంతా చుట్టి రావాలనుంది. అందుకే వీలున్నప్పుడల్లా శికార్లు చేసి వస్తుంటానని చెప్పింది. విదేశీ యానాల్లో ఎక్కువ కాలం గడిపేయడం వల్ల సినిమాల్లో నటించలేకపోతున్నానని చెప్పింది. అంతేనా పూనమ్‌ చెప్పింది నమ్యేయొచ్చా? చెప్పిన కారణంలో లాజిక్‌ ఉందనే అనిపిస్తోంది. అయితే అప్పుడప్పుడు ఎందుకు సినిమాల్లో నటించాల్సొస్తున్నట్టు? ఒకవేళ ఇక్కడ సంపాదించి ప్రయాణాలకు ఖర్చు పెడుతోందా? ఏమో! ప్చ్‌.. కానీ బజ్వాకి దక్కిన అదృష్టం వేరెవరికీ దక్కదేమో!

Tags:    

Similar News