'వకీల్ సాబ్' పై పూనమ్ ట్వీట్స్ వైరల్..!

Update: 2021-04-09 17:04 GMT
'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ''వకీల్ సాబ్'' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'పింక్' రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో మహిళలలై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. అలానే పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మాతృకలో పలు మార్పులు చేశారు. మూడేళ్ళ తర్వాత పవన్ నటించిన 'వకీల్ సాబ్' కు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ లో స్పెషల్ షోలకు అనుమతి అవ్వకపోవడం.. టికెట్ ధరలు పెంచడానికి వీలు లేదంటూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పీకే లవ్' అంటూ ట్వీట్స్ పెట్టే పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ చేసిన తాజా ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ.. "మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్ళు రాజకీయాలు? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి? ప్రెస్ మీట్ పోసాని గారూ?" అని పేర్కొంది. అంతేకాక ''సినిమా మరియు రాజకీయాల మధ్య ఏర్పాటు చేసిన వివాహం యొక్క వ్యవస్థీకృత సంబంధం అనేది సంబంధిత వ్యక్తులకు కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి. రెండూ ఒకరికొకరు కలిసి జీవించలేరు. కానీ కాపురం చెయ్యకపోతే ఫీల్ అయ్యేది చూస్తున్న జనాలు. కుళ్లు రాజకీయాలు మానేయాలి'' అని మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Tags:    

Similar News