హీరోయిన్ గా పూనమ్ కౌర్ కు కెరీర్ దాదాపుగా చివరిదశకు వచ్చింది కానీ గత కొంతకాలంగా ఏదో విషయంలో పూనమ్ పేరు మీడియాలో హైలైట్ అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ జోరుగా విమర్శలు సంధిస్తున్న సమయంలో పూనమ్ కౌర్ పేరు మధ్యలోకి లాగడంతో అప్పటినుంచి పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా పూనమ్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారని.. ఇలా దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పూనమ్ తన కంప్లయింట్ లో పోలీసులను కోరారు. ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ తనపై ఉద్దేశపూర్వకంగానే కొందరు ఈ విధంగా అసభ్యకరమైన వీడియోలు పెడుతున్నారని తనకు ఈ ప్రచారం ఎంతో వేదన కలిగిస్తోందని తెలిపారు. యూట్యూబ్ ఛానల్స్ లో తనపై అసభ్యకరంగా ఉండే వీడియో లింకుల వివరాలను కూడా పోలీసులకు అందజేసిందట.
పూనమ్ దాదాపు 50 యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరి ఈ కేసు విషయంలో సైబర్ క్రైమ్ సెల్ వారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.