టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ , కత్తి మహేష్ వివాదంలోనూ...ఆ తర్వాత పవన్ బహిరంగ సభ తర్వాతి రోజు పూనమ్ చేసిన ట్వీట్లు దుమారం రేపాయి. ఆ తర్వాత సైలెంటయిపోయిన పూనమ్ కొద్ది రోజులు తర్వాత గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ...దర్శనమిచ్చింది. తాజాగా, పూనమ్....రిషికేష్ లోని గంగా నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది. ఆ నది ఒడ్డున కరోలి బాబాతో కలిసి పూనమ్ పూజలు చేసింది. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా రావాలని పూనమ్ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ పూజ చేస్తోన్నపుడు తీసిన పూనమ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. ఏ పార్టీకి చెందకపోయినప్పటికీ...పూనమ్ కూడా వార్తల్లో నిలుస్తోంది. అయితే, పవన్ వీరాభిమాని అయిన పూనమ్..జనసేన పార్టీకి కూడాచెందిన వ్యక్తి కాదు. ప్రస్తుతం ఆమె ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ...ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసించింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో పూనమ్ ఏదో ఒక పార్టీ తరఫున బరిలోకి దిగుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పూజలు గట్రా చేయడం వెనుక పూనమ్ ఆంతర్యం...రాజకీయ అరంగేట్రమేననే వాదన వినిపిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.