డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడు వెలుగులోకి వచ్చినా.. దానితో లింకులు ఉన్నాయంటూ సినీ ఇండస్ట్రీపై కూడా ఆరోపణలు వస్తుంటాయి. అది ఏ ఒక్క ఇండస్ట్రీకో పరిమితం కాలేదు. ఇప్పుడు టాలీవుడ్ మాధకద్రవ్యాల కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 2017లో ఎక్సైజ్ శాఖ సిట్ విచారణ జరిపిన డ్రగ్స్ కేసులో లేటెస్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మొదలు పెట్టింది. అప్రూవర్ గా మారిన డ్రగ్ సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు ఈడీ అధికారులు. అయితే టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
''డ్రగ్స్ అనేది సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఇది సరిహద్దు సమస్య. ఇది రాజకీయ అజెండాకు సంబంధించిన సమస్య. ఇది బలమైన పారలెల్ ఎకానమీ సమస్య. ఈ ఇష్యూపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను పంచుకుంటాను. జై హింద్'' అని పూనమ్ కౌర్ తాజాగా ట్వీట్ చేసింది. పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. డ్రగ్స్ వ్యవహారం పై సొంత అనుభవంతో పూనమ్ ఏమి మాట్లాడుతుందో అని చర్చించుకుంటున్నారు. సినిమాలతో కంటే వివాదాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్.. గతంలో పలు విషయాలను బయటపెట్టి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు.. హీరోయిన్స్ ఛార్మీ కౌర్ ని 8 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో నేడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ విచారిస్తోంది. రాబోయే రోజుల్లో రానా దగ్గుబాటి - రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ - నవ్ దీప్ - ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - ముమైత్ ఖాన్ - తనీష్ - నందు - తరుణ్ లను ఈడీ విచారించనుంది. ఈ మేరకు ఏ తేదీల్లో హాజరు కావాలి, ఏయే డాక్యుమెంట్స్ తీసుకురావాలి వంటి విషయాలను ఈడీ నోటీసుల ద్వారా వారికి తెలిపింది.