సమంత సినిమాకి పూర్ కలెక్షన్స్..!

Update: 2022-11-16 07:30 GMT
అగ్ర కథానాయిక సమంత నటించిన "యశోద" సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి.

టాక్ కు తగ్గట్టుగానే "యశోద" సినిమాకు ప్రారంభం నుండీ కలెక్షన్లు వీక్ గానే ఉన్నాయి. వసూళ్లు పుంజుకోడానికి సమంత స్టార్ డమ్ ఎక్కడ కూడా సహాయ పడలేదు. ఏ దశలోనూ సినిమా కోలుకోలేకపోయింది. సోమవారం నుంచి కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సామ్ సినిమాకు ట్రెండ్ అంతంత మాత్రంగానే ఉంది. తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లోనూ ఈ మూవీ కలెక్షన్స్ పరిస్థితి అలానే ఉంది. రెండో వారాంతంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప.. ఈ చిత్రానికి అధిక వసూళ్లు ఆశించలేం.

'యశోద' సినిమా వసూళ్లను బడ్జెట్ లెక్కలతో పోల్చి చూస్తే నిర్మాతలకు నష్టాలే మిగిలేలా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కాకపోతే డిజిటల్ మరియు శాటిలైట్ వంటి నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఎంతో కొంత బయట పడే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా, "యశోద" అనేది సరోగసీ నేపథ్యంలో మెడికల్ మాఫియా ప్రధానంగా రూపొందిన ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్. తమిళ దర్శక ద్వయం హరి & హరీష్ తెరకెక్కించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఓ కొత్త పాయింట్ తో ఊహాజనితమైన కథని రాసుకున్న దర్శకులు.. కథని ఆసక్తికరంగా నడిపించడంలో విఫలమయ్యారు. ఊహించిన విధంగా సాగే సన్నివేశాలు.. సీన్స్ లో థ్రిల్ కొరవడటం.. ప్లాట్ పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పకపోవడం 'యశోద' సినిమాకు మైనస్ గా మారాయి.

అయితే సినిమా అంతా ఎలా ఉన్నా సమంత వరకూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తన పాత్రలో విభిన్నమైన షేడ్స్ ని సమర్ధవంతంగా చూపించడమే కాదు.. యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది. పెరఫార్మన్స్ పరంగా ఇది ఆమెకు గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.

'యశోద' సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ - ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించగా.. రావు రమేష్ - మురళీ శర్మ - కల్పిక గణేష్ - సంపత్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సుకుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News