బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి తరువాత రిలీజ్ చేసిన మొదటి చిత్రం పారి. పూర్తిగా హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను అనుష్క నిర్మించి సినిమాలో ప్రధానపాత్ర ఆమె పోషించింది. సినిమాకి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఎక్కువగా చేయలేదు కానీ ట్రైలర్ టీజర్స్ తోనే సోషల్ మీడియాలో చాలా మందిని ఆకర్షించింది. టీజర్స్ అయితే చాలా వరకు ఆకట్టుకున్నాయి. ఫైనల్ గా సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది.
అయితే సినిమా కాని వర్గాల వారిని ఎంత వరకు ఆకట్టుకుంటుందో గాని నేషనల్ మీడియా క్రిటిక్స్ మాత్రం సినిమాపై పెదవి విరిచారు. కొన్ని రేటింగ్స్ అయితే మరీ దారుణంగా పడ్డాయి. అనుష్క కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా 1/5 రేటింగ్స్ వచ్చాయి. సినిమాలో కాన్సెప్ట్ వరకు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేపినా తెరకెక్కించిన విధానంపై మాత్రం కొంచెం నెగిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. అనుష్క నటన సినిమాలో హైలెట్. బ్లడ్ - విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఊహించని భయాన్ని కలిగిస్తాయి. కానీ కేవలం అవి కొన్ని సీన్స్ వరకు మాత్రమే పరిమితం అయ్యాయనే టాక్ స్ట్రాంగ్ గా వినబడుతోంది.
సినిమా నిడివి కూడా కొంచెం పెద్దగా అనిపిస్తోంది.. అనవసర సన్నివేశాలు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి సినిమా అయితే క్రిటిక్స్ పరంగా చాలా నెగిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. మరి కలెక్షన్స్ ఎంత వరకు అందుతాయో చూడాలి.