ఏంటి.. గుండు కొట్టించుకుంటోందా??

Update: 2017-07-03 06:49 GMT
కమర్షియల్ సినిమాలుకు అందం వచ్చింది అంటే అది కేవలం హీరోయిన్ల వలనే అనే చెప్పాలి. మరి అటువంటి అందం ఒకసారి మసిబారిపోతే సినిమాకు అందం ఎలా వస్తుంది చెప్పండి. కానీ కొన్ని సినిమాలలో అందం కన్నా అభినయనంకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది  పాత్ర కోసం చిక్కడం, లావు అవడం చేస్తారు లేకపోతే ఏదైనా నేర్చుకొవలిసి వస్తే నేర్చుకుంటారు అంతే కానీ అందానికి మూలమైన శిరోజాలు తీసేయాల్సి వస్తే? అబ్బే కష్టమే.

కానీ ఇప్పుడు అటువంటి పాత్ర కోసం ఒక మలయాళ బ్యూటి సాహసం చేయనుంది. ‘అవును’ సినిమాతో తెలుగులో పాపులర్ అయిన షామ్నా కాసిం ఎలియాస్ పూర్ణ.. ఇప్పుడు సౌత్ లో బాగా బిజీ అయ్యింది. ‘సీమ టపాకాయి’ - ‘రాజు గారి గది’  సినిమాలలో కూడా నటించి మరింత దగ్గరైంది తెలుగు ప్రేక్షకులుకు. ఇప్పుడు ఒక తమిళ్ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించబోతుంది. ఈ పాత్ర కోసం పూర్ణ తన పూర్తిగా జుత్తు లేకుండా గుండు తో కనపడనుంది. మేకప్ వేసుకొన్న గుండు కాదండోయ్... నిజంగానే గుండు కొట్టించుకుంటోందట. ఇటువంటి పాత్రలు ఎప్పుడో కానీ రావట.. అందుకే ఆ సాహసం చేస్తున్నాను అంటోంది.

తమిళ్ డైరెక్టర్ ముత్తై డైరక్షన్లో వస్తున్న 'కోడి వీరం' సినిమా కోసం అమ్మడు ఈ ఫీట్ చేయనుంది. ఈ సినిమాలో శశికుమార్ - మహిమా నంబియార్ ఇంకా సనూష నటిస్తున్నారు. ఒక పల్లెటూరు జరిగే యదార్ధ కథను సినిమాగా నిర్మిస్తున్నారట. చూద్దాం మరి ఈ గుండు రోల్ అమ్మడి ఫ్యాన్స్ గుండెలను గాయపరచకుండా.. ఆమె కెరియర్ కు ఎలా ప్లస్సవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News