మన సినిమా పై పోర్న్‌ స్టార్ ప్రశంసల వర్షం

Update: 2022-07-12 07:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాడు. ఒకప్పుడు తెలుగు సినిమా గురించి ఉత్తరాది వారు మాట్లాడుకుంటే గొప్ప విషయం అన్నట్లుగా ఉండేది.

కాని ఇప్పుడు పరిస్థితి అమాంతం పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మన సినిమా గురించి ముచ్చటించుకుంటున్నారు. బాహుబలి సినిమా గురించి పలువురు హాలీవుడ్‌ స్టార్స్ మాట్లాడారు.

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది విదేశీ సెలబ్రెటీలు మరియు స్టార్స్ చూసి ప్రశంసలు కురిపించారు. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ పై తాజాగా అంతర్జాతీయ స్థాయి పోర్న్‌ స్టార్‌ కేండ్రా లస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేస్తూ ట్వీట్‌ చేయడం జరిగింది.

ఒక ఇండియన్ సినిమా గురించి కేండ్రా లస్ట్‌ స్పందించడం తో ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మన సినిమా యొక్క స్థాయిని పెంచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. ఆమె ఆర్‌ ఆర్ ఆర్‌ సినిమా తో పాటు పాటు సినిమాలో నటించిన ఇద్దరు హీరోలను కూడా గొప్పగా పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్‌ ను చేసింది.

కేండ్రా లస్ట్‌ ట్విట్టర్ లో... నెట్ ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ ల యొక్క నటన వావ్‌.. పాటలు.. సినిమాటోగ్రఫీ.. స్టంట్స్.. డైలాగ్‌ డెలవరీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్‌. ఇద్దరు హీరోలు కూడా చూడటానికి బాగున్నారు.. వారి యొక్క యాక్టింగ్‌ సినిమాకు ఆత్మగా నిలిచిందని తన యొక్క రివ్యూను ఇచ్చింది.

ఆమె సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లను ట్యాగ్‌ చేసి మరీ ట్వీట్‌ చేసింది అంటే ఏ స్థాయిలో సినిమా ఆమెకు కనెక్ట్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా గురించి కేండ్రా ట్వీట్‌ చేయడంతో నెట్‌ ఫ్లిక్స్ లో మరింతగా సినిమా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవుతుందని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా గురించి మళ్లీ చర్చ జరిగింది.
Tags:    

Similar News