డ్రగ్స్ కేసుపై పోసాని ఏమన్నాడంటే..

Update: 2017-07-25 12:23 GMT
పది రోజుల నుంచి డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు.. సినీ పరిశ్రమనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మీడియా కూడా సినీ పరిశ్రమ మీదే ఎందుకు ఫోకస్ చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఐతే కొందరు మాత్రం ఈ వాదనను తప్పుబడుతున్నారు. ప్రముఖ రచయిత.. నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌ కేసులో సిట్ అధికారులు సినీ పరిశ్రమనే టార్గెట్‌ చేశారనడం సరికాదని పోసాని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అదికారులు అన్ని రంగాలకు చెందిన వాళ్లనూ విచారణ చేస్తున్నారని.. అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని అన్నారు. విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్‌ శాంపిల్స్‌ ఇవ్వకపోవడంపై పోసాని స్పందిస్తూ.. అది వాళ్ల వ్యక్తిగత విషయం అన్నారు. తనను అడిగితే స్వచ్ఛందంగా రక్త నమూనా ఇస్తానని చెప్పారు. డ్రగ్స్ గురించే అందర మాట్లాడుతున్నారని.. తన ఉద్దేశం ప్రకారం ప్రభుత్వం సిగరెట్లు.. మద్యాన్ని కూడా నిషేధించాలని అన్నారు.

మరోవైపు డ్రగ్స్ కేసు విచారణ మంగళవారం కూడా యధావిధిగా కొనసాగుతోంది. నిన్న హీరో నవదీప్ ను విచారించిన సిట్ బృందం ఈ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను అబ్కారీ కార్యాలయానికి పిలిపించిన విచారణ జరుపుతోంది. ఇంకా ఛార్మితో పాటు ఇంకొందరు సినీ ప్రముఖులు విచారణకు రావాల్సి ఉంది. మొత్తం 12 మందికి సిట్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News