ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడ‌తారుః పోసాని

Update: 2017-07-04 14:42 GMT

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు డ్ర‌గ్స్ వినియోగిస్తున్న మాట వాస్త‌వ‌మేన‌ని విల‌క్ష‌ణ న‌టుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. అయితే, టాలీవుడ్ లో డ్ర‌గ్స్ ఉప‌యోగించేవారు కేవ‌లం ఒక‌టి, రెండు శాతం మాత్ర‌మేన‌ని చెప్పారు. ఆ శాతం కంటిలో నలుసంత మాత్రమేనన్నారు. డ్ర‌గ్స్ అల‌వాటు ఉన్న వ్య‌క్తుల‌ను ఇండ‌స్ట్రీ వాళ్లు నిర్మొహమాటంగా దూరం పెడతారని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లో డ్ర‌గ్స్ రాకెట్ గుట్టుర‌ట్ట‌యిన విష‌యం తెలిసిందే. ఇండస్ట్రీలోని ప‌లువు వ్య‌క్తులకు, డ్ర‌గ్స్ రాకెట్ కు సంబంధాలున్నాయ‌ని , ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వేళ్లూనుకుపోయిదంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా చాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని పలు విషయాలు తెలిపారు.

ఇండస్ట్రీలో డ్రగ్స్‌ వాడే వారు, వేరే వాళ్లకు అందజేసే వారు కూడా ఉన్నారని పోసాని అన్నారు. అయితే, వారెవ‌ర‌నే విష‌యం త‌న‌కు తెలియదన్నారు. ఒక‌రిద్ద‌రి కార‌ణంగా మొత్తం ఇండ‌స్ట్రీకే చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు గొప్పవాళ్లని, సినిమా వ్యవస్థ గొప్పదని ఆయ‌న అన్నారు.

యువ‌త డ్ర‌గ్స్ కు బానిస‌లు కావ‌ద్ద‌ని పోసాని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల కేవ‌లం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా వారి కుటుంబం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు. ఈ మ‌త్తుకు బానిస‌లై చాలామంది జీవితాలు నాశ‌నం చేసుకున్నార‌న్నారు. డ్రగ్స్‌ను తాను పేపర్లలో, టీవీల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదని, ప్రత్యేక సందర్భాల్లో తప్ప తానేప్పుడు మద్యం కూడా ముట్టబోనని పోసాని వివరించారు.


Tags:    

Similar News