హిందీ సినిమా ఇప్పుడు అన్నీ రకాల సినిమాలును నిర్మించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. కమర్షియల్ సినిమా ఎలాగూ ఉండనే ఉంది. అది ఎప్పటికి స్థిరంగా ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సీరియస్ సినిమాలు, రియల్ లైఫ్ స్టోరీ సినిమాలు - సెక్స్ కామిడీ సినిమాలు - రొమాంటిక్ సినిమాలు - పూర్తి కామిడీ సినిమాలు - ఫ్యామిలి స్టోరీ సినిమాలు ఇలా అన్ని రకాల సినిమాలూ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక సరదా సరదాగా సాగే కథతో పాత కొత్త నటులుతో కలిసి కొంచెం కొత్తగా వస్తున్నారు ముగ్గురు హీరోలు.
పోస్టర్ బాయ్స్ అనే మరాఠీ సినిమా రీమేక్ సినిమానే ఈ హిందీ సినిమా ''పోస్టర్ బాయ్స్''. ఒక సాధుజీవిలాంటి టీచర్ (బాబీ డియొల్) - మరో పోకిరి కుర్రాడు (శ్రేయస్ తాల్పడే) - ఇంకా ఒక మాజీ సైనికుడు (సన్నీ డియొల్) ఒకే ఊరులో ఉంటారు. ఒకసారి వీళ్ళ ముగ్గురుకి తెలియకుండా కుటంబ నియంత్రణ ఆపరేషన్ కు ప్రచారకర్తలుగా ఈ ముగ్గురుని పెట్టి పోస్టర్ని విడుదల చేస్తారు. ఇలా ఆ ముగ్గురు అటువంటి పోస్టర్ పై కనపడేసారికి వాళ్ళ ఇంటిలో ఆ ఊరిలో ఎటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి.. ఎవరు ఆ పోస్టర్ పై వాళ్ళ ఫోటోలు పెట్టారు అనేది తెలుసుకోవడానికి వాళ్ళు ఏమి చేశారు అనేది సినిమా కథ. ట్రైలర్ చూడటానికి చిన్న చిన్న జీవితాలలో ఉండే గిల్లికజ్జాలు చూపిస్తూ సరదాగా ఉంటూనే విషయం నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
మరాఠీలో ఈ పోస్టర్ బొయ్స్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఒరిజినల్ సినిమాలో లేని కమర్షియల్ సినిమా హంగులును ఇప్పుడు హిందీలో జత చేసి నిర్మించారు . శ్రేయస్ తాల్పడే - సన్నీ డియొల్ - బాబీ డియొల్ ముఖ్య పాత్రలలో కనబడనున్నారు. ఈ సినిమా పూర్తి తరహా కామిడీ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాను మాజీ హిందీ యాక్షన్ హీరో ధర్మేంద్ర ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 8 నాడు పోస్టర్ బొయ్స్ విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారు.
Full View