చిత్రం మూవీ నుంచి 'లక్ష్మీ కళ్యాణం' వరు ఎంతో మందిని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిని స్టార్స్ ని చేసిన ఘనత దర్శకుడు తేజది. ఒక దశలో యువతరాన్ని వేళం వెర్రిగా ఉర్రూతలూగించే సినిమాలని అందించిన టాలీవుడ్ లో కొత్త టాలెంట్ కి బాటలు వేసిన తేజ దర్శకుడిగా అప్పట్లో సంచలనం సృష్టించాడు. సెట్ లో ఆర్టిస్ట్ లని కొట్టడం.. వంటి వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచిన తేజ తనదైన మార్కు సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్నారు.
'నేనే రాజు నేను మంత్రి' మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన తేజ ఆ తరువాత చేసిన 'సీత' మూవీతో బిగ్ డిజాస్టర్ ని సొంతం చేసుకున్నాడు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత దగ్గుబాటి సురేష్ తనయుడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' పేరుతో ఓ మూవీని రూపొందిస్తున్నారు. జెమిని కిరణ్ నిర్మిస్తున్నా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, డైలాగ్ మోషన్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఎన్నో ఏళ్ల విరామం తరువాత ఆర్పీ పట్నాయక్ తో పాటు తన పాత టీమ్ ని మళ్లీ తేజ ఈ మూవీ కోసం రంగంలోకి దించేశాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్, రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎప్పుడో పది 12 ఏళ్ల క్రితం వాడిన థీమ్ లో వుండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురించేస్తోంది.
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ వీడియో కోసం విడుదల చేసిన పోస్టర్, దానికి వాడిన కలర్ కాంబినేషన్ ..ఈస్ట్ మన్ కలర్ కాలం నాటి థీమ్ కనిపించడంతో తేజ ఏంటీ ఇలా చేస్తున్నాడని అంతా ఆశ్చర్యపోతున్నారు.
పోస్టర్స్ డిజైన్స్ ని బట్టి చూస్తుంటే తేజ తన పాత స్కూల్ ని ఫాలో అవుతున్నట్టుగా స్పష్టం అవుతోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. రెట్రో లుక్ కోసం తేజ ఇలా చేస్తున్నాడా?.. లేక మరేదైనా కారణం వుందా? అన్నది అర్థం కావడం లేదన్నది ఓ వర్గం వాదన.
ఓటీటీలు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో తేజ ఇలా మరీ పాతకాలం ఆలోచనలతో 'అహింస' మూవీ చేస్తుండటం విచిత్రంగా వుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. చాలా మంది మాత్నం తేజ ఇప్పటికీ పాత స్కూల్ నే ఫాలో అవుతున్నట్టుగా వుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.