'దేవర'ను బండ్ల రిజిస్ట్రర్‌ చేసినా పవన్ ఒప్పుకుంటాడా?

Update: 2021-07-19 02:34 GMT
పవన్ కళ్యాణ్ కు లక్షల మంది అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు. వారందరికి ప్రతినిధి బండ్ల గణేష్‌ అనడంలో కూడా అస్సలు సందేహం లేదు. ప్రతి అభిమాని మనసులోని మాటలను.. ప్రతి అభిమాని పవన్‌ ను ఎంతగా అభిమానిస్తాడో బండ్ల గణేష్‌ రూపంగా నిలుస్తాడు. ఏదైనా వేడుకలో పవన్‌ మాట్లాడితే నిజంగా మా భావనలు.. మా ఆలోచనలు.. మా అభిమానం తెలియజేసేందుకు అలాంటి మాటలే వాడాలనుకున్నాం. మా మాటలే అన్నట్లుగా అభిమానులు అనుకునే విధంగా బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది పవన్‌ కళ్యాణ్‌ కు అభిమానులు ఉండరు.. భక్తులు ఉంటారు అంటూ ఉంటారు. బండ్ల గణేష్ నిజంగా పవన్‌ ను దేవుడిగా పూజిస్తాడు. పరమేశ్వరుడి తర్వాత అంతగా పవన్‌ ను బండ్ల గణేష్‌ ఇష్టపడుతాడు. అందుకే బండ్ల గణేష్ కదిలితే.. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్రస్థావన ఉంటుంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్‌ దేవర అనే పేరు పెట్టాడు. తన పరమశివుడి మరో పేరు దేవర. అందుకే నేను పవన్‌ కళ్యాణ్ గారిని దేవర అంటూ పిలుచుకుంటాను అంటూ ప్రకటించిన బండ్ల గణేష్‌ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పవన్ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. పవన్‌ కు దేవర పేరు చాలా బాగుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎక్కవ మంది పవన్‌ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్‌ నిర్మాణంలో ఒక సినిమా రావాలి.. దానికి దేవర అనే టైటిల్‌ పెట్టాలని బలంగా కోరుకుంటున్నారు.

దేవర టైటిల్ ను రిజిస్ట్రర్‌ చేయించండి అంటూ ఎంతో మంది బండ్ల గణేష్‌ ను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతూ ఉన్నారు. బండ్ల గణేష్‌ కూడా కొన్ని పోస్ట్‌ లకు సమాధానం ఇచ్చాడు. అన్నా... ప్లీజ్..." దేవర " టైటిల్ ... రిజిస్టర్ చేయించండి అన్నా... అంటూ ట్వీట్‌ చేయగా అందుకు ఓకే అన్నట్లుగా బండ్ల గణేష్‌ ఈమోజీ షేర్‌ చేశాడు. ఇప్పటికే బండ్ల గణేష్ ఆ టైటిల్‌ ను రిజిస్ట్రర్‌ చేయించి ఉంటాడు అనేది కొందరి వాదన. బండ్ల గణేష్‌ కు దేవర టైటిల్‌ తో సినిమా చేయాలని కోరిక ఉండవచ్చు.. అభిమానులు కూడా దేవర టైటిల్ తో సినిమా ను పవన్‌ చేయాలనే కోరిక ఉండవచ్చు... కాని పవన్‌ కు దేవర టైటిల్‌ తో సినిమా చేయాలనే ఆసక్తి ఉంటుందా.. ఆ టైటిల్‌ ను పవన్‌ ఒప్పుకుంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ ఇప్పటికే బండ్ల గణేష్‌ తో మళ్లీ సినిమాను చేసేందుకు ఓకే అన్నాడట. కాని ప్రస్తుతం ఆయన కమిట్‌ అయ్యి ఉన్న సినిమాలు అన్ని కూడా పూర్తి అయితే కాని బండ్లకు డేట్లు లభించే అవకాశం లేదు. అప్పటి వరకు కథ ను కూడా సిద్దం చేసుకుని ఉండాలి. అందుకు కాస్త సమయం పడుతుందని.. దేవుడితో భక్తుడి సినిమాకు కనీసం రెండు సంవత్సరాలైన పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News