ఈటీవీలో కొన్నేళ్ల పాటు హవా నడిపించి.. ఆపై వివిధ ఛానెళ్లలో టీవీ సీరియళ్లు చేస్తూ.. ప్రొడక్షన్లోనూ పని చేసిన ప్రభాకర్.. దర్శకుడిగా మారి ‘నెక్స్ట్ నువ్వే’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన ‘యామిరిక్కు భయమే’కు రీమేక్. అల్లు అరవింద్ సమర్పణలో ‘వీ4 క్రియేషన్స్’ నిర్మించిన ఈ చిత్రంలో ఆది కథానాయకుడిగా నటించాడు. ఐతే ఆది కంటే ముందుగా ఈ సినిమాకు వేరే హీరోను అనుకున్నాడట. ఆ హీరో మరెవరో కాదు.. ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ డమ్ సంపాదించిన విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రభాకరే వెల్లడించాడు.
‘నెక్స్ట్ నువ్వే’ స్క్రిప్ట్ ఓకే అయ్యాక తాను ముందు విజయ్ దేవరకొండను కలిసినట్లు చెప్పాడు ప్రభాకర్. ఐతే అప్పటికి విజయ్ ‘అర్జున్ రెడ్డి’ కథ విని ఒప్పుకునే దశలో ఉన్నాడని.. దీంతో తన సినిమా చేయలేకపోయాడని ప్రభాకర్ తెలిపాడు. దీంతో తర్వాత తాను ఆదిని సంప్రదించానని.. అతను ఒప్పుకున్నాకే ఈ ప్రాజెక్టు ముందుకు కదిలిందని.. ఆది ఇప్పటికే కాదు.. ఎప్పటికీ తన హీరోనే అని.. తన మొబైల్లో కూడా ‘మై హీరో’ అని ఆది నంబర్ సేవ్ చేసుకున్నానని ప్రభాకర్ తెలిపాడు. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారని.. మంచి ఔట్ పుట్ ఇచ్చారని.. కానీ పేరు మాత్రం తాను కొట్టేస్తున్నానని అన్నాడు ప్రభాకర్. తనకు అదృష్టం ఉండటం వల్లే అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత సారథ్యంలో సినిమా చేయగలుగుతున్నానని ప్రభాకర్ చెప్పాడు.