టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటాదో తెల్స? అలా వుంటాది నేను గుద్దితే.. 'బుజ్జిగాడు'లో ప్రభాస్ పంచ్ డైలాగ్ ఇది. ఈ కొత్త ఏడాది అట్టాగే ఉంటదా బుజ్జీ? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డౌట్స్ అక్కర్లేదంటున్నారు. టిప్పర్ లారీ ఎళ్లి బాలీవుడ్ ని కూడా గుద్దేయడం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే 2023లో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలన్నీ ఒకదాని వెంట ఒకటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాహుబలి- సాహో స్టార్ నుంచి దూసుకొస్తున్న మూడు బాణాలు ఎక్కడ గుచ్చుకుంటాయో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలన్న తపన ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కి ఉంది.
ప్రభాస్ ఈ సంవత్సరం మునుపెన్నడూ చూడని స్థాయి భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్లతో బిగ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు. అతడు నటించిన ఆదిపురుష్ 3డి - సలార్- ప్రాజెక్ట్ కే చిత్రాలపై ప్రపంచం కన్ను ఉంది. ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మూడు సినిమాలతో ప్రభాస్ పేరు పాన్ వరల్డ్ రేంజులో మార్మోతుందని అంతా అంచనా వేస్తున్నారు.
అయితే ప్రస్తుత సన్నివేశంలో ఆ మూడు చిత్రాల షూటింగులు ఎంతవరకూ వచ్చాయి? అన్నది ఆరా తీస్తే.. ఆదిపురుష్ 3డి చిత్రీకరణ పూర్తయి చాలా కాలమే అయింది. నిజానికి ఈ సినిమా అన్నీ కుదిరితే సంక్రాంతి 2023 బరిలో పందెం పుంజులా బరిలో దిగేది. కానీ వీఎఫ్ ఎక్స్ బెటర్ మెంట్ కోసం జూన్ కి వాయిదా పడింది. మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఓంరౌత్ తొందర్లోనే మరోసారి అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటిస్తారని డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
అలాగే ప్రభాస్ ఇంకా 30-35 రోజుల షూటింగ్ మిగిలి ఉన్న 'సలార్'ను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత అన్నిటికంటే పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ K ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుందని టాక్ ఉంది.
అంటే.. వచ్చే ఏడాదే విడుదలకు ఆస్కారం ఉంది. అయితే మారుతితో సినిమా మాత్రం ఇదే ఏడాది చివరిలో విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. సలార్- ఆదిపురుష్ తర్వాత మారుతీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ చివరి భాగంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత నిర్మాణానంతర పనులు పూర్తి చేసి కేవలం మరో రెండు నెలల గ్యాప్ లోనే సినిమా విడుదలయ్యేందుకు ఛాన్సుందని అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ ఈ సంవత్సరం చివరి నాటికి మూడు క్రేజీ సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చే ఛాన్సుంది. ఈ ఏడాదిని డార్లింగ్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ప్రభాస్ సినిమా వస్తోంది అంటే అటు ఖాన్ ల సినిమాలకు ధీటుగా బాలీవుడ్ లోను విడుదలవుతుండడంతో ఉత్తరాదినా బోలెడంత సందడి నెలకొననుంది. తెలుగు -తమిళం-కన్నడం -మలయాళం- హిందీ కాదేదీ రిలీజ్ కనర్హం. టిప్పర్ లారీ వెళ్లి గుద్దేత్తే ఎట్టా ఉంటదో ప్రభాస్ ఈ సంవత్సరం చూపించబోతున్నాడన్నమాట!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.