మ‌రోసారి చిక్కుల్లో ప్ర‌భాస్ 'ఆది పురుష్'!

Update: 2023-01-14 06:31 GMT
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌'. టి సిరీస్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఆది నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముంబైలో షూటింగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంగా సెట్ లో అగ్ని ప్ర‌మాదంతో వార్త‌ల్లో నిలిచిన 'ఆది పురుష్‌' ఇప్ప‌టికీ ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో న‌టించిన ఈ మూవీని ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు.

జ‌ప‌నీస్ యూనిమేష‌న్ మూవీ 'రామాయ‌ణ ది లార్డ్ ఆఫ్ ప్రిన్స్ రామ' స్ఫూర్తితో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈమూవీ టీజ‌ర్ ని ఇటీవ‌ల విడుద‌ల చేయ‌డం, సినిమాలోని పాత్ర‌ల‌ని డిజైన్ చేసిన తీరుపై దేశ వ్యాన్తంగా విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. శ్రీ‌రాముడిగా ప్ర‌భాస్ మేకోవ‌ర్‌, రావ‌ణ బ్ర‌హ్మ‌గా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరు.. సీత పాత్ర‌లో కృతి స‌న‌న్‌, ప్ర‌భాస్ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు..

సినిమాలోని కొన్ని స‌న్నిఏవ‌శాల్లో హ‌నుమంతుడి క్యారెక్ట‌ర్ మేకోవ‌ర్‌.. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ సినిమాపై విమ‌ర్శ‌లు వెల్లు వెత్త‌డంతో సినిమా వివాదాస్ప‌దంగా మారింది. దీంతో న‌ష్ట‌నివారణ చ‌ర్య‌లకు పూనుకున్న చిత్ర బృందం గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం మ‌రో 100 కోట్లు కేటాయించి రీ వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్న నేపథ్యంలో ఈ మూవీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.  ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ని ఎలాంటి సెన్సార్ లేకుండా ప్ర‌ద‌ర్శించార‌ని కుల్దీప్ అనే వ్య‌క్తి కోర్టుని ఆశ్ర‌యింయ‌డం ఇప్ప‌డు వివాదాస్ప‌దంగా మారింది.

'ఆది పురుష్' టీజ‌ర్‌ పై అల‌హాబాద్ కోర్టుతో కుల్దీప్ అనే వ్య‌క్తి కేసు వేశాడు. సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికెట్ రాకుండానే టీజ‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింద‌ని చిత్ర బృందంపై కేసు వేశాడు. అంతే కాకుండా సీతాదేవి పాత్ర‌లో న‌టించిన కృతి స‌న‌న్ దుస్తుల‌పైనా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. కుల్దీప్ వేసిన పిల్ ని స్వీక‌రించిన అల‌హాబాద్ కోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 21కి వాయిదా వేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News