మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్ - అనుష్క!

Update: 2018-12-29 10:16 GMT
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.   చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. ఫెయిర్ మాంట్ హోటల్ లో సందడి ఓ రేంజ్ లో ఉందట. ఎంతోమంది సెలబ్రిటీ అతిథులు హాజరయినా ఇక్కడ ఒక జంట మీద మాత్రం అందరి ఫోకస్ పడిందని సమాచారం.

ఆ జంట ఎవరో కాదు సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ జోడీ ప్రభాస్ - అనుష్క.  ఇప్పటికే ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి గానీ అవన్నీ రూమర్లని ఖండించారు. మేం ఒట్టి స్నేహితులమే.. ఆ వార్తలన్నీ తూచ్ అంటూ వాళ్ళిద్దరూ ఎన్ని సార్లు చెప్పినా జనాల అనుమానాలు నివృత్తి కావడం లేదట.  ఎందుకంటే  జైపూర్ లోని వివాహ వేదిక దగ్గర ప్రభాస్ అనుష్కలు అతిథులను రిసీవ్ చేసుకోవడం.. పెళ్ళి పనుల్లో రాజమౌళికి సహాయం చేయడం లాంటివి చేస్తున్నారట.  పనిలో పనిగా ముచ్చట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారట.. రాజస్థాని స్టైల్ మ్యూజిక్ కు కలిసి డ్యాన్స్ కూడా చేశారట.  దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరికీ అనుమానం వస్తోందట.

ఇద్దరూ జంటగా ఉన్న వీడియో క్లిప్పులు కూడా ఇప్పటికే సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.  వీటితో సంబంధంలేకుండా ప్రభాస్ మాత్రం తనకు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని అంటున్నాడట. ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్ళి చేసుకునేవరకూ జనాలు ఈ మాటలను నమ్మేలా లేరు!


Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News