యూరప్ లోనే ప్రభాస్ సినిమా

Update: 2018-06-08 09:33 GMT

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ లో తలమునకలైన సంగతి తెలిసిందే. నిర్మాణ పరంగా ఆలస్యం అవుతుండటంతో పాటు సిజి వర్క్ కోసం చాలా టైం అవసరం కనక ఆ లోపు మరో సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నాడు ప్రభాస్. గోపిచంద్ తో జిల్ లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసిన దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తో సినిమా చేస్తానని బాహుబలి టైంలోనే ప్రభాస్ మాటిచ్చాడు. సాహో త్వరగా పూర్తవుతుందేమో అన్న అంచనాతో అప్పుడు ఆ మాట ఇచ్చాడు. కానీ సాహోకు మరో ఏడాది పైగా టైం అవసరం పడటంతో వచ్చే ఆగష్టు నుంచి రాధా కృష్ణ సినిమా చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. పూర్తి స్క్రిప్ట్ తో సహా ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్న రాధా కృష్ణ దీన్ని పూర్తిగా యురప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించనున్నట్టు సమాచారం

షూటింగ్ లో కీలక భాగం యూరప్ లో జరపడంతో పాటు అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన సెట్స్ కూడా హైదరాబాద్ లో వేయబోతున్నట్టు తెలిసింది. కానీ సాహో కన్నా ముందే అయితే విడుదల కాకపోవచ్చు. ఎంత లేదన్నా దీనికి కూడా ఏడాదిపైగా టైం అవసరమయ్యేలా ఉండటంతో సాధ్యం కాదు. కానీ బాహుబలి వల్ల వచ్చిన గ్యాప్ మొత్తాన్ని ప్రభాస్ ఫాన్స్ వచ్చే సంవత్సరం భర్తీ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు సినిమాలు 2019లోనే విడుదల కానున్నాయి. డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ రెండింటి మధ్య మహా అయితే ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండే అవకాశం లేదు. ప్రభాస్ ఇంతవరకు చేయని ఒక సరికొత్త జానర్ లో ఇది ఉండబోతోంది అని తెలిసింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలో కాకుండా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఇది ఉండేలా రాధా కృష్ణ స్క్రిప్ట్ రాసుకున్నట్టు టాక్. హీరోయిన్ ఎంపికతో పాటు టీమ్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు రాధా కృష్ణ.
Tags:    

Similar News