బాహుబలి తరువాత ఆ స్థాయిలో ఎన్ని సినిమాలు వచ్చినా ఆ సినిమాలను అంతగా పట్టించుకోరు గాని సాహో సినిమాకు మాత్రం బాహుబలి చుసిన ప్రతి ఒక్కరు ఆకర్షితులు అవుతారనేది వాస్తవం. ఎందుకంటే ప్రభాస్.. బాహుబలితో తో ఏ స్థాయిలో ఆదరణ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు సాహో సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ పై కన్నేశాడు. దీంతో తన మార్కెట్ రేంజ్ ఏంటో ప్రభాస్ కి ఈ సినిమా తర్వాత ఓ క్లారిటీ వస్తుంది.
అయితే సాహో సినిమా హై లెవల్ లో ఉండాలని నేషనల్ లెవెల్ నటీనటులను కూడా తెస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే దాదాపు అన్ని పాత్రలకు సరైన వారినే సెట్ చేసుకున్నాడట దర్శకుడు సుజీత్. అయితే హీరోయిన్ విషయంలో ఎంతో శ్రద్దగా ఆలోచించి శ్రద్దా కపూర్ ని తీసుకున్నవారు ఆమెకు తెలుగు కూడా నేర్పిస్తున్నారట. అయితే సినిమాతో ప్రభాస్ మొదటిసారి డైరెక్ట్ హిందీ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. శ్రద్దా డైరెక్ట్ గా తెలుగుకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో ప్రభాస్ -శ్రద్దా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట. రెండు భాషల్లో ఒకేసారి రెండు సీన్స్ ని తెరకెక్కించాలి కాబట్టి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఒకరినొకరు టెస్ట్ చేసుకునేలా హిందీ - తెలుగు బాషలని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారట.
ప్రభాస్ హిందీలో కూడా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడని టాక్. బాహబలి లో అయితే సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ శరద్ కేల్కర్ - ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పాడు. ఇక శ్రద్దా అయితే తెలుగు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఆమె కూడా డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయిపోతుందట. అది సంగతి.