తెలుసుకోవాలి కదబ్బా.. సన్నీ సింగ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

Update: 2021-11-08 06:47 GMT
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌. ఆయన గురించి ఏ ఒక్క చిన్న విషయం అయినా కూడా సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ గా మారిపోతుంది. ప్రభాస్ విషయంలో ఏ స్టార్‌ చిన్న నోరు జారినా లేదంటే కాస్త అటు ఇటుగా ప్రవర్తించినా కూడా సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో ఆట ఆడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సన్నీ సింగ్ చేసిన చిన్న తప్పుతో ప్రభాస్ అభిమానులు చిరాకు పడుతున్నాడు. ప్రభాస్ గురించి ఈ చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలా ఇండస్ట్రీలో ఉన్నావయ్యా.. పైగా నువ్వు ప్రభాస్ తో కలిసి నటించావు కూడా.. అలాంటి నీకు ప్రభాస్ గురించి ఈ విషయం తెలియక పోవడం అవమానంగా ఉందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సన్నీ సింగ్ ను సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌ అభిమానులు ఇంతగా కోపం తెచ్చుకోవడానికి కారణం సన్నీ సింగ్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్‌.

ట్విట్టర్ లో ప్రభాస్ ను కించ పర్చే విధంగా ఏమీ సన్నీ సింగ్ పోస్ట్‌ లు పెట్టలేదు. పెద్దన్న అంటూ ప్రభాస్ కు చాలా గౌరవం ప్రేమను చూపిస్తూనే పోస్ట్‌ ను పెట్టాడు. ప్రభాస్ తో దిగిన ఫొటోను షేర్ చేసి చాలా గొప్పగా సన్నీ సింగ్ ఫీల్‌ అయ్యాడు. అంతా బాగానే ఉంది కాని ప్రభాస్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్‌ చేసిన సమయంలో తన అభిమానంను ప్రభాస్ పై చూపిస్తూ ప్రభాస్ ను ట్విట్టర్ లో ట్యాగ్‌ చేయడం జరిగింది. ట్విట్టర్ అకౌంట్ ఉన్న వారిని మాత్రమే ట్విట్టర్ లో ట్యాగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రభాస్ కు ట్విట్టర్ లో అకౌంట్‌ లేదు. అందుకే ప్రభాస్ గురించి ఎవరు ప్రత్యేకంగా ట్వీట్‌ చేసినా కూడా ప్రభాస్ హ్యాష్‌ ట్యాగ్‌ ను ఉపయోగిస్తారు. సన్నీ సింగ్ కు ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్‌ లేదనే విషయం తెలియకనో మరేంటో కాని ట్యాగ్‌ చేశాడు.

ప్రభాస్ పేరు మీద కొన్ని వేల ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ప్రభాస్ అనే పేరు కొట్టగానే వచ్చిందని ఆ అకౌంట్‌ ను సన్నీ సింగ్ ట్యాగ్‌ చేశాడు. ఆ తర్వాత కూడా సన్నీ సింగ్‌ చూసుకోలేదు. ఇంత నిర్లక్ష్యం ఏంటీ సన్నీ అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కు అఫిషియల్‌ గా ఫేస్ బుక్ మరియు ఇన్‌ స్టా గ్రామ్‌ అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. ఎంతో మంది స్టార్స్ ట్విట్టర్ లో ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం ట్విట్టర్ లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆదిపురుష్‌ సినిమా లో ప్రభాస్ కు తమ్ముడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి అయ్యింది.

ప్రభాస్ గురించి చాలా రోజులు నటించడంతో పాటు ప్రభాస్ గొప్పతనం గురించి తెలిసిన సన్నీ సింగ్ కు ట్విట్టర్ లో ప్రభాస్ కు అఫిషియల్‌ అకౌంట్‌ ఏమీ లేదనే విషయం తెలియదా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి కదా సన్నీ అంటూ ప్రభాస్ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న సన్నీ సింగ్ కు ఆదిపురుష్ లో లక్ష్మణుడి పాత్ర దక్కింది. ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్‌ లో మరింత బిజీ అవ్వడంతో పాటు హీరోగా మంచి గుర్తింపు దక్కించుకుంటాననే నమ్మకంతో సన్నీ కనిపిస్తున్నాడు.


Tags:    

Similar News