శేరిలింగంపల్లి రెవిన్యూ పరిధిలోని రాయదుర్గం సర్వే నెం.46లో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిలో ఉందంటూ తాజాగా రెవిన్యూ అధికారులు ఆ గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన విషయం తెల్సిందే. తన గెస్ట్ హౌస్ ను సీజ్ చేయడం పై ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం కూడా తెల్సిందే. ప్రభాస్ తరపు న్యాయవాది తన క్లైయింట్ చాలా సంవత్సరాలుగా ఇంటి పన్నుతో పాటు కరెంటు బిల్లు కూడా చెల్లిస్తున్నాడని, ప్రభాస్ కు చట్ట పరమైన అన్ని అర్హతలు ఆ గెస్ట్ హౌస్ పై ఉన్నాయని, కాని రెవిన్యూ అధికారులు మాత్రం నిబందనలకు విరుద్దంగా గెస్ట్ హౌస్ ను సీజ్ చేశారని వాధించాడు.
ప్రభాస్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు ప్రస్తుతానికి ఆ గెస్ట్ హౌస్ ను యదాస్థితిని కొనసాగించేలా మద్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. ఈ విషయమై ఇంకా విచారణ జరపాల్సి ఉంది. తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసింది. కోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభాస్ కు ఊరట దక్కింది. కేసు సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉంది. కనుక ప్రభాస్ ఎలాంటి చిక్కులు, ఇబ్బంది లేకుండా తన గెస్ట్ హౌస్ ను వినియోగించుకోవచ్చు.