యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి గురించి తీవ్రంగా చర్చ జరిగింది. ఎంతకు ప్రభాస్ పెళ్లి చేసుకోక పోవడంతో ఇక లాభం లేదని ఫ్యాన్స్ ఆయన పెళ్లి గురించి ఆలోచించడం మానేశారు. ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన పెళ్లి చేసుకోక పోవడం మంచిది అంటూ వేణు స్వామి అంటున్నాడు. ఆయనకు పెళ్లి కలిసి రాకపోవచ్చు అని.. ఆయన పెళ్లి చేసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. ఫెయిల్యూర్స్ ను ఎదుర్కోవలసి రావచ్చు అంటూ వేణు స్వామి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే భార్యతో గొడవలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నాడు.
నాలుగు పదుల వయసు దాటిన ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ జ్యోతిష్యుడు చెప్పిన విషయం తో ప్రభాస్ పెళ్లి ఇక కాదేమో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కుటుంబ సభ్యులు లేదా ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు నుంచి పెళ్లి వార్తలు వస్తున్నాయి. బాహుబలి 1 తర్వాత పెళ్లి ఉంటుందని అంతా భావించారు. కాని బాహుబలి రెండు పార్ట్ లు వచ్చేశాయి. సాహో.. రాధేశ్యామ్ సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయన నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నాడు. కాని పెళ్లి విషయం మాత్రం ఎత్తడం లేదు. ముందుగానే జ్యోతిష్యం చూయించుకుని పెళ్లికి ప్రభాస్ దూరంగా ఉంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభాస్ పెళ్లి ప్రస్థావన వచ్చిన సమయంలో కచ్చితంగా అనుష్క గురించిన ప్రస్థావన వస్తుంది. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కనుక ప్రభాస్ పెళ్లి చేసుకోకుంటే కనీసం అనుష్క అయినా పెళ్లి చేసుకుంటుందా అనేది అందరిలో ఆసక్తి ని రేకెత్తిస్తోంది.