యూర‌ప్ నుంచి ప్ర‌భాస్ రాక ఎపుడు?

Update: 2020-03-17 15:30 GMT
క‌రోనా వైర‌స్ (కొవిడ్-19) ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త్ పైనా పంజా విసురుతోంది. రోజు రోజుకి ఇండియాలో బాధితుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. మ‌హ‌మ్మారీ ప్ర‌స్తుతం రెండ‌వ ద‌శ‌లో కొన‌సాగుతోంది. మూడు.. నాలుగు ద‌శ‌ల్లోకి ప్ర‌వేశిస్తే కొవిడ్ -19ని అదుపు చేయ‌లేమ‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రించారు. ఇది దేశంలో ప్ర‌తి పౌరుడు తెలుసుకుని బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఎవరికి వారు శ్ర‌ద్ధ తీసుకుని సూచ‌న‌లు పాటిస్తే త‌ప్ప అదుపు చేయ‌లేని అంటు రోగ‌మిది. అందుకే భార‌త్ ఇప్ప‌టికే స‌మ‌స్తం బంద్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే అమ‌లులో ఉంది. దీనిలో భాగంగా టాలీవుడ్ లో షూటింగులు నెలాఖ‌రు వ‌ర‌కూ బంద్ చేసిన సంగ‌తి తెలిసిందే.

24 శాఖ‌లు బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రించి ఒకేతాటిపైకొచ్చాయి. అంత‌కు ముందే ప‌రిశ్ర‌మ పెద్ద‌  మెగాస్టార్ చిరంజీవి త‌న  152వ చిత్రం షూటింగ్ ని నిలిపివేసి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. అన్ని కార్మిక‌ శాఖ‌లు పిలుపునిచ్చాయి కాబట్టి స్వ‌దేశం స‌హా విదేశాల్లో కూడా ఎక్క‌డా షూటింగ్  చేయ‌కూడ‌ద‌న్న నియ‌మం అమ‌ల్లోకి వ‌చ్చింది. కానీ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జాన్ చిత్రం షూటింగ్ కోసం యూర‌ప్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా క‌రోనా వైర‌స్ ముదిరిన స‌మ‌యంలో జాన్ టీమ్ జార్జియా ప్లైట్  ఎక్క‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం అక్క‌డే  నిర‌వ‌ధిక‌గా షూటింగ్ జ‌రుగుతోంది.

అయితే ఛాంబ‌ర్ ఆదేశాల మేర‌కు విదేశాల నుంచి జాన్ టీమ్ తిరుగు ప్ర‌యాణం అవుతుందా లేదా? అన్న చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇండియాతో పోలిస్తే యూర‌ప్ లో క‌రోనా బాధితులు ఎక్కువ. మ‌నం హాట్ వెద‌ర్ లో ఉన్నాం కాబ‌ట్టి ఇక్క‌డే సేఫ్‌. అందుకే జాన్ టీమ్ తిరిగి ఇండియాకి వ‌స్తుంద‌ని యూవీ క్రియేష‌న్స్ వ‌ర్గాల ద్వారా లీకులందాయి. మ‌రో నాలుగు రోజుల్లోనే జాన్ టీమ్ అక్క‌డ ప‌నులు ముగించుకుని ఇండియాకి తిరిగి వ‌చ్చేయ‌నుంద‌ట. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మెగాస్టార్ చిరంజీవి.. డార్లింగ్ ప్ర‌భాస్.. స‌హా ఆల్మోస్ట్ పెద్ద సినిమాల షూటింగులు అన్నీ ఆగిపోయిన‌ట్టే. అంద‌రూ ఛాంబ‌ర్ - ప్ర‌భుత్వం జాయింట్ డెసిష‌న్ ని గౌర‌వించిన‌ట్టే అవుతుంది. ఇక ఎస్.ఎస్.రాజ‌మౌళి - ఆర్.ఆర్.ఆర్ టీమ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News