ప్రభాస్ 40కి రచ్చ ఎక్కడ?

Update: 2018-09-15 10:57 GMT
డార్లింగ్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ బాహుబలి తర్వాత తన మార్కెట్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు భారతదేశంలో ప్రభాస్ అంటే తెలియని సగటు సినిమా ప్రేమికుడు లేడంటే  అతిశయోక్తి కాదేమో. ఒకవేళ పేరు చెబితే గుర్తుపట్టలేకపోయినా ఫోటో చూపిస్తే చాలు అమరేంద్ర బాహుబలి అంటూ హుషారెత్తిపోతారు. ప్రస్తుతం సాహోతో పాటు దర్శకుడు రాధా కృష్ణ సినిమాలో బిజీగా ఉన్న ప్రభాస్ వచ్చే అక్టోబర్ 23న 40వ వసంతంలోకి అడుగు పెడతాడు. ఇప్పటికే తన పెళ్లి గురించి రకరకాల ఊహాగాలను చెలరేగుతున్న నేపధ్యంలో ప్రభాస్ సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకంటే మంచిదని పెదనాన్న కృష్ణంరాజుతో సహా ఇతర కుటుంబ సభ్యులు బాగా ఒత్తిడి చేస్తున్నారట. చూద్దాం అంటూ మాట దాట వేస్తూ వచ్చిన ఈ రెబెల్ స్టార్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ సానుకూల నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రకటన చేసే అవకాశం ఉందని సన్నిహితుల సమాచారం.

ఆ మధ్య కొంతకాలం హీరోయిన్ అనుష్కతో ప్రేమ గురించి రకరకాల వార్తలు వచ్చినప్పుడు ఇద్దరూ విడివిడిగా ఖండించారు. మరోవైపు ఏదో గోదావరి జిల్లా నుంచి ఓ అమ్మాయిని ప్రభాస్ కోసం చూసారని సంబంధం ఖాయమయ్యందనే రేంజ్ లో హడావిడి చేసారు. కానీ అదీ నిజం కాదని తేలిపోయింది. సాహో తర్వాత నిర్ణయం తీసుకుంటే బెటరని అభిమానులు సూచిస్తున్నారు. సినిమాల కోసం వ్యక్తిగత జీవితం త్యాగం చేయటం సరికాదని ఎప్పుడు జరగాల్సిన ముచ్చట ఆ వయసులో అయిపోవాలని కోరుతున్నారు. మరి ప్రభాస్ ఇవన్నీ విని ఇప్పుడైనా  అయినా సరైన నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నారు. సాహొలో శ్రద్ధ కపూర్ తో ఆడిపాడుతున్న ప్రభాస్ రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే సరసన అల్లరి చేయబోతున్నాడు. జాయింట్ షెడ్యూల్ కోసం త్వరలో యూరోప్ వెళ్లబోతోంది ప్రభాస్ గ్యాంగ్.
   

Tags:    

Similar News