టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తోంది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు లైన్ లో పెట్టిన నిర్మాతలు.. అనేక మంది హీరోలకు అడ్వాన్స్ లు ఇచ్చారనే టాక్ ఉంది. ఈ క్రమంలో చాన్నాళ్ల క్రితమే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమాకి కమిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ తో సినిమా ఉంటుందని మైత్రీ టీమ్ ఇప్పటికే ధృవీకరించింది. ఇందుకు గాను 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని.. ఇప్పటికే 20 కోట్ల వరకూ అడ్వాన్స్ ఇచ్చారని నివేదికలు పేర్కొన్నాయి. అలానే డార్లింగ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ను సంప్రదించినట్లు ఏడాదిన్నర క్రితమే వార్తలు వచ్చాయి.
మైత్రీ బ్యానర్ లో ప్రభాస్ మరియు సిద్ధార్థ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంతవరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు డైరెక్టర్ కు ఆఫర్ చేసిన రెమ్యునేషన్ తో తాజాగా మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది.
"వార్" వంటి భారీ యాక్షన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్.. గతంలో సలామ్ నమస్తే - బచనా హే హసీనో - అంజానా అంజానీ - బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ప్రభాస్ తో ఓ భారీ మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
దీని కోసం డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఒక్కడికే దాదాపు 80 కోట్ల వరకూ పారితోషికంగా అందజేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో ఇప్పటికే 25 శాతం అడ్వాన్స్ రూపంలో చెల్లించారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రభాస్ కోసం తీసుకొస్తున్న కాస్ట్లీ డైరెక్టర్ గురించే టాక్ నడుస్తోంది.
మైత్రీ టీమ్ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయడానికి భారీగానే ఖర్చు చేశారు. దీనికి తగ్గట్టుగానే బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? అప్పటి వరకూ దర్శక హీరోలకు ఇచ్చిన అడ్వాన్స్ లకు ఇంట్రెస్ట్ లు ఎంత అవుతాయి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో "పఠాన్" సినిమా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ విడుదల కాబోతోంది. దీని తర్వాత హృతిక్ రోషన్ తో "ఫైటర్" అనే సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంటే దర్శకుడు ప్రభాస్ స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఓం రౌత్ తో చేసిన "ఆదిపురుష్" సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిసస్తున్న "సలార్" సినిమా షూటింగ్ ఇంకా సగం ఉంది. 2023 సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న "ప్రాజెక్ట్ K" సినిమా సెట్స్ మీద ఉంది. పాన్ ఇంటర్నేషనల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎప్పటికి పూర్తి అవుతుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. ఈ గ్యాప్ లో మారుతి దర్శకత్వంలో డార్లింగ్ సైలెంట్ గా ఓ మూవీని మొదలు పెట్టారు. మారుతి వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేస్తాడు కాబట్టి.. దీంతో వచ్చిన ఇబ్బందేమీ లేదు.
కాకపోతే ప్రభాస్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన "స్పిరిట్" మూవీని సెట్స్ మీదకు తీసుకురావాల్సి ఉంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా ఫినిష్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయటానికి రెడీగా ఉన్నాడు. ఇవన్నీ పూర్తైన తర్వాత గానీ ప్రభాస్ మరో మూవీ చేసే అవకాశం లేదు. సో అప్పటి వరకూ మైత్రీ వాళ్ళు వేచి చూడక తప్పదు. మరి ప్రభాస్ - సిద్ధార్థ్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో.. అప్పటికి నిర్మాతలకు ఇంకెంత ఖర్చు అవుతుందో చూడాలి.