ఎటుచూసినా నీరుతో చెన్నైపురి కన్నీరు కారుస్తుంది. పాల ప్యాకట్లు, నీళ్ళ ప్యాకట్లకు సైతం జనం క్యూలో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దృశ్యం కనబడుతుంది. ఆశ్రయంకోసం ప్రజలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెన్నై ప్రజల దుస్థితి చూసి తెలుగు ప్రజలు చలించిపోయారు.
ప్రకృతి ప్రతాపం చూపిన ప్రతీసారి టాలీవుడ్ సెలబ్రిటీలు తామున్నామంటూ చేయూతనివ్వడం ఆనందకరం. అందులోనూ తెలుగు పరిశ్రమ చెన్నై నుండే మొదలవడంతో ఇక్కడి వారికి అక్కడి జ్ఞాపకాలు ఎక్కువే. ఇప్పటికే అల్లు అర్జున్ పాతిక లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు, తారక్ ఫ్యామిలీ 15లక్షలు ప్రకటించగా తాజాగా డార్లింగ్ ప్రభాస్ 15 లక్షలు చెన్నై బాధితుల సహాయార్ధం విరాళాన్ని ప్రకటించడం అభినందనీయం. ఇదే బాటలో మరికొందరు సెలబ్రిటీలు నడవనున్నట్టు తెలుస్తుంది.