వర్కవుట్స్ ముందు వేరే ప్లాన్ వేసిన ప్రభాస్

Update: 2017-01-09 11:21 GMT
యంగ్ రెబల్ స్టార్ కు.. ఇప్పుడు బాహుబలి మూవీ షూటింగ్ నుంచి విముక్తి లభించింది. మూడున్నర ఏళ్లకు పైగా సాగిన బాహుబలి కోసం.. తన అమూల్యమైన టైమ్ ను చాలా కేటాయించాడు ప్రభాస్. గత మూడేళ్లుగా కనీసం సరిగ్గా తినకుండా.. మందు పార్టీల్లో ఎంజాయ్ చేయకుండా గడపాల్సి వచ్చింది. ఇదంతా బాహుబలి మూవీ కోసం ఫిజిక్ పర్ఫెక్ట్ గా మెయింటెయిన్ చేయడం కోసమే.

ప్రభాస్ తన తర్వాతి ప్రాజెక్టుగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ డైరెక్షన్ లో ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు. ఈ మూవీ కోసం 20 కిలోల వెయిట్ తగ్గేందుకు కొత్తగా వర్కవుట్స్ మొదలుపెట్టాల్సి ఉంది. సుజిత్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యేలోగా ఓ లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు ప్రభాస్. సంక్రాంతి పండుగ పూర్తయ్యాక రెండు వారాల పూర్తిగా వెకేషన్ కు కేటాయించాడని తెలుస్తోంది. కంప్లీట్ 15 రోజులు ఔటాఫ్ స్టేషన్ లో ఎంజాయ్ చేసిన తర్వాతి తిరిగి హైద్రాబాద్ వస్తాడట.

అప్పుడు తన బరువు తగ్గేందుకోసం వర్కవుట్స్ ప్రారంభిస్తాడు ప్రభాస్. ఇక సుజిత్ సినిమా మొదలుపెట్టడానికి అయితే.. మే నెల మొదటి వారంలో ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇందుకు ప్రభాస్ బరువు తగ్గడం అన్నది మెయిన్ రూల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News