#రాధేశ్యామ్.. ఇందిరా గాంధీ స్నేహితుడి బ‌యోపిక్‌!?

Update: 2020-12-11 11:52 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టించి ప్ర‌భాస్ జాతీయ స్థాయిలో హీట్ పెంచిన సంగ‌తి తెలిసిందే. ఓంరౌత్ - నాగ్ అశ్విన్ - కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ల‌తో పాన్ ఇండియా (వ‌ర‌ల్డ్) సినిమాల్ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నాల‌కు తెర తీసాడు. బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత సాహో మ‌రో అతిభారీ పాన్ ఇండియా చిత్రంగా సంచ‌ల‌నం సృష్టించ‌గా.. అంత‌కుమించిన ప్ర‌య‌త్నాల‌కు డార్లింగ్ శ్రీ‌కారం చుట్ట‌డం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.

ప్ర‌స్తుతం జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న మూవీ కూడా పాన్ ఇండియా కేట‌గిరీలోనే రిలీజ్ కానుంది. ప్ర‌భాస్ ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థలో న‌టిస్తున్నా.. ఈ మూవీ స్టోరి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో అల‌రించ‌నుంద‌న్న గుస‌గుస‌లు ఇప్ప‌టికే వినిపిస్తున్నాయి.

ప్ర‌భాస్ ఇందులో రిచ్ బిజినెస్ మేన్. దేశ ప్ర‌ధానుల్ని క‌లిసేంత గొప్ప డ్యాషింగ్ బిజినెస్ మేన్. రెట్రో డేస్ లో ఖ‌రీదైన కార్ల వ్యాపారిగా క‌నిపిస్తాడ‌ట‌. రెట్రో డేస్ కి ప్ర‌స్తుత కాలంతో క‌నెక్షన్ ఉంటుంది. నాటి రోజుల్లో లెజెండ‌రీ ప్ర‌ధాని ఇందిరా గాంధీని క‌లిసేంత స‌న్నిహితుడు అట‌. స‌ద‌రు బిజినెస్ మేన్ త‌ప్ప వేరొక‌రు ఎవ‌రికీ ఇందిర‌ కార్యాల‌యంలో కలిసే ఛాన్సే ఉండ‌ద‌ట‌.

ప్ర‌స్తుతం ప్రభాస్ - ఇందిరా గాంధీ పాత్ర‌ధారిపై సన్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సీన్ సాగుతుంది. ప్ర‌ధానిని క‌లిసేంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అంటే.. బ‌హుశా ప్ర‌ధానికి ఇందిర‌కు అంత గొప్ప స్నేహితుడా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. 2021లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత‌నే అన్ని సందేహాల‌కు తెర ప‌డుతుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News