ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కితున్న `ప్రాజెక్ట్ K` రోజులు గడిచే కొద్దీ సర్వత్రా ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో టాలీవుడ్ లో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. బాహుబలి ఫార్మాట్ లో జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న చిత్రమిది. ప్రభాస్ అభిమానులు బాహుబలి - సాహో తర్వాత అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి.
అమితాబ్ ఓ కీలక పాత్రను పోషిస్తుండగా దీపిక పదుకొనే ధీటైన నాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత - పృథ్వీరాజ్ కుమారన్ వంటి టాప్ స్టార్లు నటిస్తున్నారన్న టాక్ రావడంతో ఒకటే ఉత్కంఠ పెరిగింది. ప్రాజెక్ట్ -కే హాలీవుడ్ స్టాండార్డ్స్ తో సంచలనాలు సృష్టించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఈ గురు పూర్ణిమ రోజున ప్రాజెక్ట్ -కె షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్లో బిగ్ బి అమితాబ్ చిత్రీకరణలో పాల్గొనగా షూట్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మహానటి ఫేం డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
ఈసినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బాహుబలి 1 కోసం 180 కోట్లు.. బాహుబలి 2 కోసం 250 కోట్లు ఖర్చు చేశారని ప్రచారమైంది. అలాగే 2.0 చిత్రానికి లైకా సంస్థ ఏకంగా 500కోట్ల పెట్టుబడి పెట్టిందని అప్పట్లో కథనాలొచ్చాయి. ఇప్పుడు అంతకుమించి బడ్జెట్ పెట్టేందుకు అశ్వనిదత్ రెడీ అయ్యారట. బడ్జెట్ విషయంలో తగ్గేదే లే! అంటూ ఆయన చాలా పంతంతో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్చువల్ రియాలిటీ.. సహా అత్యున్నత సాంకేతికతతో అవతార్ టెక్నీషియన్లను బరిలో దించి ఈ సినిమాని రూపొందిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి కోసం ఐదేళ్ల పాటు లాక్ అయిన ప్రభాస్ ప్రాజెక్ట్-కె కోసం దాదాపు 200 రోజులు కాల్షీట్లను ఇచ్చారట.
రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- పూజాహెగ్గే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రాధేశ్యామ్` పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ లేకుండా నిర్మిస్తోంది. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి మెస్మరైజ్ చేయనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్ గా తీర్చిదిద్దారు. ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని మూవీ అని సమాచారం. ఈ చిత్రం మకర సంక్రాంతి (పొంగల్) సందర్భంగా విడుదలవుతుందని పోస్టర్ చెబుతోంది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ప్రభాస్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తుండం కూడా ఎగ్జయిట్ మెంట్ ని పెంచింది. ఈ చిత్రంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంట ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ నిర్మించింది. బాలీవుడ్ లో టీసిరీస్ రిలీజ్ చేయనుంది.
సలార్ వర్సెస్ ఆదిపురుష్ 3డి
ఓవైపు `ఆదిపురుష్ 3డి`.. మరోవైపు సలార్ చిత్రాలతో ప్రభాస్ బిజీ బిజీ. ఇరు చిత్రాల షెడ్యూల్స్ కోసం ప్రభాస్ అటూ ఇటూ షఫుల్ అవుతున్నారు. ఈ రెండిటి చిత్రీకరణలు బ్యాలెన్స్ చేస్తూనే ఇప్పుడు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ -కె షెడ్యూళ్లని మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకేసారి తెరకెక్కుతుండడం తో ప్రభాస్ లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. సలార్ లో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా ఆదిపురుష్ 3డిలో కృతి సనోన్ కథానాయికగా నటిస్తుండడం ఆసక్తికరం. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల నడుమ అభినయం పరంగా పోటీ అనివార్యం. సలార్ లో శ్రుతి అల్ట్రా మోడ్రన్ గాళ్ గా యాక్షన్ మోడ్ లో కనిపించనుండగా కృతి సనోన్ సాంప్రదాయ కట్టు బొట్టుతో సీతాదేవిగా కనిపించనున్నారు.