ప్రభాస్‌ చాలా తక్కువిచ్చామంటున్న జక్కన్న..

Update: 2015-07-07 10:16 GMT
రాజమౌళి, ప్రభాస్‌ల రిలేషన్‌షిప్‌ను కేవలం 'డైరెక్టర్‌-హీరో' కోణంలో మాత్రమే చూడలేం. వాళ్లిద్దరి మధ్య అంతకుమించి వ్యక్తిగత అనుబంధముందని వాళ్ల మాటల్ని బట్టి అర్థమవుతుంది. బాహుబలి ఆడియో వేదిక సాక్షిగా అందరికీ తెలిసొచ్చింది వాళ్లిద్దరి మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉందో అని. రాజమౌళి ఏడాది డేట్లు అడిగితే.. ప్రభాస్‌ రెండేళ్లు ఇచ్చాన్నాడు. కానీ రెండేళ్లు కూడా కాదు.. మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్లలో ప్రభాస్‌ మామూలుగా అయితే ఓ నాలుగు సినిమాలు చేసేవాడు. ఆ నాలుగు సినిమాలకు పారితోషకం లెక్కగడితే ఎక్కడికో వెళ్తుంది. మరి బాహుబలి సినిమాకు ప్రభాస్‌కు ఎంతిచ్చినట్లు? ఈ విషయంలో ముందు ప్రభాస్‌కు, నిర్మాతలకు ఏం ఒప్పందం కుదిరింది? ఈ సంగతులు రాజమౌళి మాటల్లోనే విందాం పదండి.

''బాహుబలి చేయడానికి ముందు ప్రభాస్‌కు వరుసగా మూడు హిట్లున్నాయి. అతడికి సూపర్‌ క్రేజ్‌ ఉంది. అలాంటి సమయంలో నేను ఏడాది డేట్లడిగితే.. రెండేళ్లు తీసుకోమన్నాడు. ఈ సినిమా కోసం కెరీర్లో ఎప్పుడూ పడనంత కష్టపడ్డాడు. మూడేళ్లు బాహుబలి లోకంలోనే ఉన్నాడు. ఐతే ఆరు నెలల వరకు అతడి రెమ్యూనరేషన్‌ ప్రస్తావనే రాలేదు. ఆ తర్వాత నిర్మాతల్ని తీసుకొచ్చి.. అతడి స్థాయికి చాలా తక్కువ మొత్తం రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేశాం. బడ్జెట్‌ పరిమితుల దృష్ట్యా అంతకుమించి డబ్బులు ఇవ్వలేమని చెప్పాం. ఐతే ప్రభాస్‌ మాత్రం.. నాకు అంతిస్తున్నారా అన్నాడు. ప్రభాస్‌ లాంటి హీరో దొరకడం నా అదృష్టం. అతడి కమిట్‌మెంట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే'' అన్నాడు రాజమౌళి. అంతా చెప్పాడు కానీ.. ప్రభాస్‌కు ఎంతిచ్చిందన్నది మాత్రం వెల్లడించలేదు జక్కన్న. ఇంతకుముందు తన రెమ్యూనరేషన్‌ విషయంలోనూ.. కోటి కోటిన్నర తక్కువే తీసుకుంటున్నట్లు చెప్పాడు కానీ.. ఆ ఫిగర్‌ ఎంతన్నది మాత్రం రాజమౌళి చెప్పలేదు.

Tags:    

Similar News