పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమాకి కమిటవ్వడం టాలీవుడ్ లో సడెన్ ట్విస్టుగా భావిస్తున్నారు. అప్పటికే ఎందరో టాప్ డైరెక్టర్లు డార్లింగ్ కి కథలు నేరెట్ చేసారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సహా పలువురు టాప్ క్లాస్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారు. `అర్జున్ రెడ్డి ఫేం` సందీప్ రెడ్డి వంగా.. వంశీ పైడిపల్లి.. సురేందర్ రెడ్డి లాంటి వాళ్లు స్క్రిప్టులు వినిపించి వెయిటింగ్ లో ఉన్నారు. కానీ వీళ్లెవరికీ డార్లింగ్ ఓకే చెప్పలేదు. కొంతకాలంగా అందరినీ హోల్డ్ లోనే ఉంచాడు. ఈలోగానే సడెన్ ట్విస్ట్.
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ప్రాజెక్ట్ ఫిక్స్ అంటూ కొత్త పేరు తెరపైకి రావడం అంతటా చర్చకు తావిచ్చింది. అయితే ప్రభాస్ అంగీకరించడానికి కారణమేమిటి? స‌్క్రిప్ట్ పరంగా నాగ్ అశ్విన్ వాళ్లందరికంటే బెటర్ పోజిషన్ లో ఉన్నాడా? లేక అంతకు మించి ఇంకేవైనా కారణాలున్నాయా? అంటూ ఆరా తీస్తే పలు ఆసక్తికర సంగతులే తెలిశాయి.
ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని దర్శకుడే వెళ్లడించారు. స్క్రిప్ట్ పరంగా నాగ్ అశ్విన్ పర్ పెక్ట్ గా డీల్ చేశారట. మహానటి సక్సెస్ వెనక అతడి హార్డ్ వర్క్ ని డార్లింగ్ గుర్తించారు. అయితే కేవలం ఇవి మాత్రమే అతడిని ఆకర్షించలేదు. ప్రభాస్ ని లాక్ చేయడానికి మేజర్ ప్యాక్టర్ వేరొకటి కూడా ఉందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ తన సొంత నిర్మాణ సంస్థ వైజయంతి పిక్చర్స్ లో నిర్మిస్తున్నారు. ప్రభాస్ 50 కోట్లు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా ఇస్తానని ఎర వేసారట. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి మార్కెట్ రేంజు ఉంటుంది. పైగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లకు ఆస్కారం ఉంటుంది అన్న నమ్మకంతోనే దత్ కమిట్ అయ్యారట. తెలుగు- హిందీ- తమిళ్ సహా ఇతర భాషలు..విదేశాల్లో ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్ ని వెచ్చించే ఆలోచనలో ఉన్నారట. ఎంచుకున్న స్క్రిప్ట్ కూడా ఫిక్షన్ కావడంతో యూనివర్శల్ గా వర్కవుట్ అవుతుందనే కాన్పిడెన్స్ తోనే దత్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కారణాలు ఏవైనా టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ సడెన్ షాకింగ్ ట్విస్ట్ అనడంలో సందేహమేం లేదు.