తెలుగునాట సినిమాలకు.. రాజకీయాలకు లింకు ఎప్పట్నుంచో ఉంది. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం తర్వాత ఎంతోమంది సినీతారలు రాజకీయాలతో అంటకాగారు. కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. ఇంకొందరు పార్ట్ టైం రాజకీయాలు చేశారు. ఎన్నికలు వచ్చినపుడు సినీ గ్లామర్ ను వాడుకోవడం కొత్తేమీ కాదు. ఈ తరం యువ కథానాయకుల్లోనూ కొందరు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నవారే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన పెదనాన్న కృష్ణం రాజు కోసం ఎన్నికల్లో పని చేశాడు. ఐతే ఆ అనుభవం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వలేదని అంటున్నాడు ప్రభాస్. ఒక్కసారి ఎన్నికల కోసం పని చేసేసరికే తనకు తల ప్రాణం తోక లోకి వచ్చినట్లయిందంటున్నాడు ప్రభాస్.
‘‘పెదనాన్నగారు మొగల్తూరు ఎంపీగా చేసినప్పుడు నాకు విపరీతమైన సహనం అలవడింది. ఆయన నెల రోజుల పాటు నాకు మొగల్తూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. నా దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరూ తమ సమస్యల గురించి.. పార్టీ గొడవల గురించి చెప్పేవారు. ఏం సమాధానం చెప్పాలో నాకు తెలిసేది కాదు. నాకు రాజకీయాలు అసలే తెలియదు. నావల్ల ఒక్క ఓటు కూడా రాదు. కనీసం పోకుండా చూద్దామని వాళ్లు చెప్పేవన్నీ ఓపిగ్గా వినేవాడిని. ఏమీ మాట్లాడేవాడిని కాదు. నెల తర్వాత పెదనాన్నగారికి దండం పెట్టి... మీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. జీవితంలో ఇంకోసారి నన్ను పిలవకండి అని చెప్పి వచ్చేశా. నాకు రాజకీయాలు సెట్ కావని అప్పుడే అర్థమైంది’’ అని ప్రభాస్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/