ప్రభాస్ కథానాయకుడిగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ 3డి. ఓంరౌత్ దర్శకుడు. కృతి సనోన్ కథానాయిక. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తొలి టీజర్ పై చిన్నపాటి విమర్శలు వెల్లువెత్తాయి. యానిమేటెడ్ పాన్ ఇండియా మూవీ అంటూ కొందరు కామెంట్లు చేయడం సోషల్ మీడియాల్లో కనిపించింది. ఇందులో శ్రీరాముడి పాత్ర లంకేష్ పాత్ర ప్రతిదీ వీ.ఎఫ్.ఎక్స్ లో ప్రెజెంట్ చేసిన తీరుపై కొన్ని విమర్శలొచ్చాయి.
దీనిపై టాలీవుడ్ అగ్ర నిర్మాత పంపిణీదారుడు దిల్ రాజు తాజా ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ-ఆదిపురుష్ పై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చూసారు. బాహుబలి రిలీజ్ సమయంలోనూ విమర్శలొచ్చాయి. శివలింగాన్ని భుజంపైకి ఎత్తి నడిచే సన్నివేశంపై క్రిటిసైజ్ చేసారు. కానీ నేను ఆ మూవీ చూసి ప్రభాస్ కి చెప్పాను. ఇది బంపర్ హిట్ అని .. ! ఇప్పుడు కూడా ఆదిపురుష్ టీజర్ చూసాను.
విమర్శలొచ్చాయని అన్నారు. ఇందులో రామాయణం కథను పాత్రలను తీసుకుని మోడ్రనైజ్డ్ కంటెంట్ తో అందిస్తున్నారు. సెల్ ఫోన్ లో చూసినవి సరికాదు. నేను ఇంట్లో పెద్ద టీవీ స్క్రీన్ పై చూసాను. ఇప్పుడు థియేటర్లలోనూ చూసాను. 3డిలో చూసాను. ఎంతో నచ్చింది... అని ప్రభాస్ అన్నారు. తానాజీ లాంటి అద్భుత సినిమా తీసిన ఓంరౌత్ తో ప్రభాస్ సినిమా చేయడం బిగ్ సక్సెస్ అని కూడా అన్నారు.
ఆదిపురుష్ పాత్రధారి.. డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ-``మొదటిసారి 3డి చూసినప్పుడు నేనైతే చిన్న పల్లాడిని అయిపోయాను. రేపు అభిమానుల కోసం 60 థియేటర్లలో 3డిలో వేస్తున్నాం. అభిమానులే మాకు అండ. వాళ్లే మొదట చూడాలి. మొదట అభిమానులకు నచ్చాలి. ఈ టెక్నాలజీ ఇండియాలో మొదటిసారి. 3డిలో బిగ్ స్క్రీన్ పై మొదటిసారి నేను నటించిన 3డి సినిమా వస్తోంది. టీజర్ తో పాటు కొన్ని వారాల్లోనే ఇంకా మంచి కంటెంట్ తో మళ్లీ వస్తాం. అభిమానులంతా థియేటర్లలో 3డి విజువల్స్ చూసి ఆస్వాధిస్తాని అనుకుంటున్నాం. మీ రివ్యూ కూడా ఇవ్వండి`` అని అన్నారు.
ఈ వేదికపై టీసిరీస్ అధినేతలు సహా ఆదిపురుష్ చిత్రానికి పని చేసిన నిర్మాతలు టెక్నీషియన్లు పాల్గొన్నారు. చెడుపై మంచి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడమే ఆదిపురుష్. ఇందులో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు-హిందీ-తమిళం-మలయాళం-కన్నడంలో అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.