నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య అక్టోబర్ 23 గురించే చర్చ ఎక్కువ జరుగుతోంది. ప్రభాస్ పేరుమీదున్న ఫేస్ బుక్ పేజీలో మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఆ రోజు వస్తుంది అని ఒక పోస్ట్ కనిపించడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.దీంతో ఇది సాహో అప్ డేట్ గురించా అనే ఆలోచనలో చాలా సేపు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ దీని వెనుక మరో స్వీట్ న్యూస్ ఉందని ఇన్ సైడ్ టాక్. అదేంటంటే ప్రభాస్ పెళ్లి ప్రకటన రావోచ్చట.
గుంటూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి ప్రభాస్ త్వరలో అల్లుడు కాబోతున్నాడు అనేది దాని సారాంశం . గుంటూర్ జిల్లాలో బాగా పలుకుబడి ఉన్న ఆ ఫ్యామిలీతో వియ్యానికి ఎందరో వేచి చూస్తుండగా ఏకంగా బాహుబలితోనే సంబంధం కుదరడం అంటే మాటలా. ఇది నిజమో కాదో నిర్ధారణ కాలేదు కాని ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. గత కొన్నేళ్ళుగా ప్రభాస్ పెళ్లి వార్త ఏదో ఒకరకంగా నానుతూనే ఉంది. కొంతకాలం అనుష్క-ప్రభాస్ ల మధ్య బాండింగ్ గురించి కథలు అల్లిన ఓ వర్గం తర్వాత ఆ ఇద్దరు వాటిని కొట్టి పారేయడంతో చెక్ పడింది. పైగా ప్రభాస్ కాని స్వీటీ కాని ఈ మధ్య మీడియాకు సైతం దొరకడం లేదు.
సో ఆ కథకు ఇప్పుడీ వార్త నిజమైతే పూర్తిగా చెక్ పడినట్టే. ఈ మధ్యే పెదనాన్న కృష్ణంరాజు తామూ ప్రభాస్ కు పెళ్లి చేయాలనే చూస్తున్నామని బాహుబలి అయ్యాక సాహో అంటున్నాడని ఇప్పటికే ఆలస్యం అయ్యిందని చెప్పిన సంగతి తెలిసిందే. క్రేజీ హీరోలలో ఇంత పెద్ద మార్కెట్ ఉండీ పెళ్లి కాని ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఒక్కడే. ఇప్పుడు ఆ శుభ ఘడియలు కూడా వచ్చేస్తే డార్లింగ్ ఫ్యాన్స్ పండగే పండగ. వచ్చే ఏడాది సాహోతో పాటు తమ హీరో పెళ్లి వేడుకలు కూడా ఎంజాయ్ చేస్తారు. చూద్దాం ఇంకో ఐదు రోజుల్లో సస్పెన్స్ వీగిపోతుందిగా.