ప్రభాస్ కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం `సాహో` ఆగస్టు 30న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి సరిగ్గా 23రోజుల సమయం మిగిలి ఉంది. అంటే ఈ కొద్ది పాటి సమయం ప్రచారానికి ఎంతో ఇంపార్టెంట్. అందుకు తగ్గట్టే చిత్రయూనిట్ భారీగా ప్రమోషన్స్ కి ప్లాన్ చేసింది. తొలిగా ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అటుపై వరుసగా మెట్రో నగరాల్లో ప్రత్యేక ఈవెంట్లతో ప్రచారం చేయనున్నారు. అందుకు షెడ్యూల్ ని యు.వి. క్రియేషన్స్ సంస్థ ప్లాన్ చేసింది. మెట్రో నగరాల ప్రచారంపై ఇదివరకూ తుపాకి కొన్ని వివరాల్ని అందించింది. తాజాగా మరిన్ని సంగతులు తెలిశాయి.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. తొలిగా బాలీవుడ్ లో ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ముంబైలో ఈనెల 10న ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 11న హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరగనున్నాయి. వీలును బట్టి మీడియా ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఆ మరునాడే చెన్నయ్ లో ట్రైలర్ లాంచ్ మీడియా ఇంటరాక్షన్స్ ప్లాన్ చేశారు. ఆగస్టు 13న కొచ్చి నగరంలో.. ఆగస్టు 14న దేశ రాజధాని నగరం న్యూదిల్లీలో ఇదే తరహా ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత వరుసగా ఆగస్టు 26 వరకూ ప్రభాస్ అన్ని మీడియాల్లో ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటారట. ఆగస్టు 27న దుబాయ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ ముఖ్యులు హాజరవుతారట. అలాగే 29 ఆగస్ట్ దుబాయ్ లో ప్రీమియర్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. అమెరికా సహా బ్రిటన్ లోనూ ప్రమోషన్ వేడుకలు ఉంటాయిట. ఇక కన్నడలోనూ రిలీజ్ ప్లాన్ ఉంది కాబట్టి బెంగళూరు సహా అక్కడ ప్రచారం ఎలా సాగనుందో తెలియాల్సి ఉంది.
బాహుబలి సిరీస్ ఘనవిజయం నేపథ్యంలో ప్రభాస్ ఈ హై బడ్జెట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే `బాహుబలి`తో పోలిస్తే `సాహో` ప్రచారానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ కొద్దిపాటి సమయంలో షెడ్యూల్ భారీగా ఉండడంతో చిత్రబృందంపై ఒత్తిడి నెలకొందని అర్థమవుతోంది. కేవలం 20 రోజుల సమయంలోనే అన్ని నగరాల్ని కవర్ చేస్తూ దేశ విదేశాల్లో ప్రచారం చేయడం అంటే ఆషామాషీగా ఉండదు. మరి దీనిని ఎలా అధిగమిస్తారు? అన్నది చూడాలి. వీఎఫ్ ఎక్స్ లో క్వాలిటీ కోసం రిలీజ్ తేదీని వాయిదా వేయడం అభిమానుల్ని నిరాశపరిచింది. అయినా ఆగస్టు 30 రిలీజ్ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ప్రామిస్ కి తగ్గట్టే మూవీ కంటెంట్ అన్ని వర్గాల్ని మైమరిపిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.