మంచువారితో డార్లింగ్ గారు..!

Update: 2019-10-27 09:42 GMT
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ గురించి అందరికీ తెలిసిందే.  ఇండస్ట్రీలో చాలామందికి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్.. అందరికీ స్వీట్ డార్లింగ్.  రీసెంట్ గా ప్రభాస్ మంచు వారింటికి వెళ్ళాడు.   మంచు ఫ్యామిలీతో సరదాగా గడిపాడు.  ఈ విషయన్ని మంచు విష్ణు స్వయంగా తెలుపుతూ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.

ఈ ఫోటోలకు "నా సోదరుడు.. ఇలా సూపర్ ఫన్నీగా ఉదయం/సాయంత్రం గడిపి చాలా కాలం అయింది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  ఈ ఫోటోలలో ప్రభాస్.. విష్ణు ఇద్దరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు. మరో ఫోటోలో విష్ణు ఏదో సీరియస్ గా వివరిస్తూ ఉంటే ప్రభాస్ చిరునవ్వుతో వింటున్నాడు.  ఇంకో ఫోటోలో ప్రభాస్ తో పాటు విష్ణు.. విష్ణు సతీమణి విరానిక కూడా ఉన్నారు.

ప్రభాస్.. మోహన్ బాబుతో కలిసి 'బుజ్జిగాడు' సినిమాలో నటించారు.  అప్పటినుంచి ప్రభాస్ కు మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడిందని సమాచారం.  అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.  డార్లింగ్ నేచర్ అంతే.. ఒకసారి ఫ్రెండ్షిప్ ఏర్పడితే ఇక అది పర్మనెంట్ గా ఉంటుంది. ఈ ఫోటోలు చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది.  సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ నెక్స్ట్ మంత్ నుంచి 'జాన్' షూటింగ్ లో పాల్గొంటాడు.  విష్ణు విషయానికి వస్తే కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. కొత్త ప్రాజెక్ట్  ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News