వాళ్లిద్దరికీ నా డ్యాన్స్ అంటే అస్సలు నచ్చదు

Update: 2016-09-26 12:05 GMT
ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ ఎవరంటే సౌత్.. నార్త్ అని తేడా లేకుండా ఎవరైనా ప్రభుదేవా పేరు చెప్పేస్తారు. మరి అలాంటి డ్యాన్స్ మాస్టర్ కు మన తెలుగులో ఈ మధ్య నచ్చిన డ్యాన్సింగ్ నంబర్స్ ఏవని అడిగితే.. ‘‘హైదరాబాద్ లో ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లందరూ చాలా బాగా చేయిస్తున్నారు. నాకు ఈ మధ్య కాలంలో తెలుగులో మూడు పాటలు నచ్చాయి. బన్నీ చేసిన టాపు లేచిపోద్ది పాట.. చరణ్ మెగా మీటర్ సాంగ్.. ఎన్టీఆర్ ఐవానా ఫాలో ఫాలో పాటలు నచ్చాయి’’ అని ప్రభుదేవా చెప్పాడు. ఐతే ఇప్పుడున్న హీరోల్లో ఎవరెలా డ్యాన్స్ చేసినా.. డ్యాన్స్ విషయంలో తన ఆల్ టైం ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవే అని ప్రభుదేవా అన్నాడు.

నటన.. దర్శకత్వం.. నృత్య దర్శకత్వం.. ఈ మూడింట్లో అత్యంత ఇష్టమైంది ఏది అని ప్రభుదేవాను అడిగితే.. ‘‘నిస్సందేహంగా డ్యాన్స కంపోజింగే. అదిచ్చే సంతృప్తి నాకు ఇంకేదీ ఇవ్వదు. ఇప్పటికీ నాకు ఏదైనా పాటకు డ్యాన్స్ వేయాలన్నా.. డ్యాన్స్ కంపోజ్ చేయాలన్నా చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను చేసిన పాటలన్నీ కూడా ఎగ్జైట్మెంట్ ఇస్తాయి. రేపు ఓ పాటను కంపోజ్ చేయాలంటే ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టదు. చాలా ఉత్సాహంగా ఉంటుంది’’ అని ప్రభుదేవా అన్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ‘‘నా ఇద్దరు కొడుకులకు మంచి జీవితాన్నివ్వడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. వాళ్లిద్దరికీ నా డ్యాన్స్ అంటే అస్సలు నచ్చదు. సినిమాల మీదా ఆసక్తి లేదు. ప్రస్తుతం చదువుకుంటున్నారు. వాళ్ల ఆసక్తులేంటో గమనించి అందులో ప్రోత్సహిస్తాను’’ అని ప్రభుదేవా అన్నాడు.
Tags:    

Similar News