సునీల్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌

Update: 2015-07-01 07:27 GMT
కమెడియన్‌ కం హీరో సునీల్‌ ఇటీవలి కాలంలో రేసులో వెనకడుగు వేశాడు. లేటైనా లేటెస్టుగా రావాలన్నది అతడి ఆలోచన. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. దిల్‌రాజు ఆస్థాన రచయిత, జోష్‌ ఫేం వాసువర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. టాకీ సహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి.             

    ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది అనగానే మరో సినిమాకి సునీల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇటీవలే వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళ్లనున్నారు. ప్రస్తుతం నాయిక కోసం వెతుకుతున్నారు. అయితే ఇంతలోనే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ దేశాయ్‌ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి కనబరిచిందని తెలుస్తోంది.

    క్యూట్‌ లుక్స్‌, హాట్‌ అప్పియరెన్స్‌ ప్రాచీ ప్రత్యేకత. రాక్‌స్టార్‌ చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించి ఉత్తమ ఫిలింఫేర్‌ డిబట్‌గా అవార్డు అందుకుంది. ఆ తర్వాత బోల్‌ బచ్చన్‌, పోలీస్‌ గర్ల్‌, ఏక్‌విలన్‌ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రాకాన్‌ 2, అజహర్‌ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇంతలోనే టాలీవుడ్‌లో సునీల్‌ సరసన నాయికగా ఎంపికైంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. అదీ సంగతి.

Tags:    

Similar News