తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి ప్రగతి అందరికి సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి.. సినిమాల్లో అత్తగా తల్లిగా పిన్నిగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా అప్పుడప్పుడు మెరుస్తుంది. నిజానికి ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టి పెరిగిన ప్రగతి.. మొదట హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి తెలుగులోకి ప్రవేశించింది. ప్రస్తుతం మహమ్మారి వలన ప్రగతి కూడా ఇంటికే పరిమితం అయింది. ఇక ఇంట్లో ఖాళీగా ఉండలేక తనకు ఇష్టమైన డ్యాన్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఓ రేంజ్ లో అలరిస్తుంది. ఇప్పటికే ఆమె చేసిన డాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే.. తాజాగా మరో వీడియోను ప్రగతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి.. వ్యాయామంలో భాగంగా డ్యాన్స్ చేసినట్లు చెప్తుంది. గత వీడియోలకంటే వెరైటీగా ట్రై చేసింది. ఇందులో బ్రేక్ డ్యాన్స్ తో పాటు ఫాస్ట్ మూమెంట్స్ చేసి అదరగొట్టింది. ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లు కొందరు నోరెళ్లబెడుతుంటే.. మరికొందరు ప్రశంసలు కురపిస్తున్నారు. ప్రగతి తన పోస్ట్ ద్వారా..‘‘తుఫానును శాంతింపజేయడానికి ప్రయత్నించడం మానండి. మిమ్మల్ని మీరు శాంతింపజేసుకుంటే తుఫాన్ వెళ్లిపోతుంది. వర్కౌట్ తర్వాత నౌటంకి’’ అని తన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రగతిని యూత్ అంతా మరి ఆంటీ అనాలా.. లేక యంగ్ అమ్మాయి అనాలా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే లాక్ డౌన్ లో ప్రగతి తుఫాన్ రేపుతోందని చెప్పాలి.