మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం లేటెస్ట్ సిరీస్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తుండగా.. తాజాగా జరిగిన ఎపిసోడ్ కు నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. 'మన్మథుడు సింగిల్ గా రావడం ఏంటి.. అమ్మాయి తోడు లేకుండా' అని చిరంజీవి వెతుక్కుంటుంటే.. 'మీరు అడుగుతారనే ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నాకు మరదలిగా నటించిన ప్రగ్యా జైస్వాల్ ను కూడా తోడు తెచ్చుకున్నా' అంటూ ప్రగ్యాను షోలోకి తెచ్చాడు నాగ్.
మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్వహణ చేతులు మారడంపై చిరు-నాగ్ ల మధ్య కొంతసేపు సంభాషణ తర్వాత.. 'కంచెలో చూశాను.. బాగా చేశారు.. ఇప్పుడు నాగ్ తో చేయడం పై మీ ఫీలింగ్ ఏంటి? రెండింటికీ ఏంటి తేడా?' అంటూ కంచె బ్యూటీని అడిగారు చిరు. 'నేను చేసిన కంచె 75 సంవత్సరాల క్రితం స్టోరీ అయితే.. ఈ సినిమా కోసం 500 ఏళ్లు వెనక్కెళ్లాం' అని ప్రగ్యా చెప్పింది. అలాగే నాగార్జున గురించి తెగ పొగిడేసింది ప్రగ్యా. ఓం నమో వేంకటేశాయలో మొదటగా వీరిద్దరూ చేసిన రొమాంటిక్ పాటనే షూట్ చేశారని చెప్పింది ప్రగ్యా.
ఈ పాటలో ప్రగ్యా బొడ్డుపై ఫ్లవర్స్ వేసే సీన్ ఒకటి ఉంటుంది. నిజానికి ఈ సీన్ పెట్టాలని దర్శకుడు రాఘవేంద్రరావు అనుకోలేదట. కానీ తనే అడిగి మరీ ఆ సీన్ పెట్టించుకుని చేసింది అని చెప్పేశాడు నాగార్జున. ఇంతలో అందుకున్న ప్రగ్యా.. 'మొదటి రోజు షూటింగ్ అయిపోయింది.. రెండో రోజు షూటింగ్ అయిపోయింది. మూడో రోజు కూడా అయిపోతుంటే.. అప్పుడు ఇక నేనే అడిగేశాను' అని చెప్పింది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత మెగాస్టార్ దీనికి ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా అదిరిపోయింది.
'పెయింటింగ్ వేసిన తర్వాత ఆర్టిస్ట్ సంతకం పెట్టినట్లుగా.. పాటలో హీరోయిన్ బొడ్డుపై పళ్లు..పూలు వేయడం రాఘవేంద్రరావు గారి సిగ్నేచర్. అలా వేయించుకున్న వాళ్లందరూ స్టార్ హీరోయిన్స్ అయిపోయారు కదా. అందుకే ప్రగ్యా కూడా అడిగి మరీ ఆ సెంటిమెంట్ ను ఫాలో అయుంటుంది' అంటూ నవ్వులు పూయించారు చిరు. మొత్తానికి హీరో నాగార్జునకు.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు లేని ఆలోచన అయిన.. బొడ్డు మీద పూలతో కొట్టించుకోవడం అనే సీన్ ని అడిగి మరీ పెట్టించుకున్న ప్రగ్యా జైస్వాల్.. సెంటిమెంట్ ప్రకారం స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/