ఫోటో స్టొరీ: సింప్లీ మెస్మరైజింగ్ బ్యూటీ

Update: 2019-09-01 06:26 GMT
టాలీవుడ్లో మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మొదటి సినిమా 'కంచె'తోనే మంచి గుర్తింపు సాధించింది.  క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' లో సీత పాత్ర పోషించి అందరినీ  మెప్పించింది. అయితే ఆ తర్వాత ప్రగ్య నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ప్రగ్య కెరీర్ నెమ్మదించింది.  గ్లామర్ రూట్ లోకి మారి మరీ ప్రేక్షకులను మెప్పించాలని చూసినా ప్రగ్యకు హిట్టు దక్కలేదు.

అయితే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది ప్రగ్య.  హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ కళాపోషకులైన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  తాజాగా మరోసారి అదే పని చేసింది.  తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి "మీకు డౌట్  గా ఉన్నప్పుడు వైట్ కలర్ ధరించండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలలో ప్రగ్య ఫుల్ స్లీవ్స్ ఉండే వైట్ కలర్ గౌన్ ధరించి వయ్యారంగా పోజులిచ్చింది. షార్ట్ గౌన్ కావడం..  వీనెక్ ఉండడంతో గ్లామరస్ గా కనిపిస్తోంది.  బ్లీచ్ చేసి ఓ పక్కకు దువ్విన హెయిర్ స్టైల్.. పర్ఫెక్ట్ మేకప్ తో స్టైల్ ను కూడా రంగరించింది. 

ఈ ఫోటోలు నెటిజన్లకు కూడా ఈ ఫోటో తెగనచ్చడంతో లైక్స్ కొట్టడమే కాకుండా ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.  "సింప్లీ మెస్మరైజింగ్ బ్యూటీ".. "బ్యూటిఫుల్ ఏంజెల్".. " స్నో వైట్ ప్రిన్సెస్".."100 పర్సెంట్ హాటీ" అంటూ కామెంట్లు పెట్టారు.  ఈ రేంజ్ లో హాట్ షోలు చేస్తూ చెలరేగిపోతూ ఉంటే కంచెపాప ఎవరో ఒక టాలీవుడ్ ఫిలిం మేకర్ దృష్టిలో పడడం ఖాయమే.
Tags:    

Similar News