ఫోటో స్టొరీ: పూతరేకులా ఉన్న ప్రగ్య

Update: 2018-08-30 13:12 GMT
'ఎవ్విరిథింగ్ హ్యాజ్ ఎ బ్యూటీ బట్ నాట్ ఎవిరివన్ సీస్ ఇట్'(ప్రతిదాన్లో అందం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ దాని చూడలేరు). ఇది కన్ఫ్యూషియస్ అనే చైనా పెద్దాయన పాపులర్ కొటేషన్.  అయన చెప్పినట్టు మనం అన్నిటిలో అందం చూడాలంటే ఏ తత్వవేత్తో - శాస్త్రవేత్తో అయిఉండాలి కానీ పైన ఉండే ఫోటోలోని ప్రగ్య అందం చూడలంటే మాత్రం జస్ట్ కళ్ళు ఉంటే చాలు.

అలా అని కళ్ళు మూసుకుని నాకు కనడలేదు అని వెర్రి మొర్రి లాజిక్ లు దయచేసి చెప్పొద్దు! ఈమధ్య  ప్రగ్యకు అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియాలో జనాల నిద్రను పాడు చేయాలని గట్టిగా డిసైడ్ అయినట్టుంది. అందుకే హాట్ ఫోటోలతో పాటు హార్ట్ మెల్ట్ చేసేలాంటి ఇలాంటి అందమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి తీరిగ్గా కామెంట్లు చదువుతూ - లైక్స్ నంబర్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నట్టుంది.  క్రీమ్ కలర్ బ్రౌన్ కలర్ కలగలిసిన పొట్టి పూల గౌన్ లోఅందాలను చూపించి చూపించనట్టు చూపిస్తూ - ఓరకంట చూస్తూ సూపర్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. లిప్ స్టిక్ తప్ప పెద్దగా మేకప్ లేదు.

టోటల్ గా ఎలా ఉంది అంటే..  పూతరేకులు - పాలకోవా లాంటి ఉపమాలంకారాలు ఉదయందాకా చెప్పేలా అందరినీ ఉసిగొల్పేలా ఉంది.  ఈ ఫోటోకి ఆమె పెట్టిన క్యాప్షన్ 'au naturel'(ఔ న్యాచురెల్) ఇంగ్లీష్ లో ఉండే ఈ ఫ్రెంచ్ ఎక్స్ ప్రెషన్ కు అర్థం ఫుల్ న్యాచురల్ అని.  ఇక నెటిజన్లు లైకులు కొట్టడం కూడా ఔ న్యాచురెల్లే కదా!
Tags:    

Similar News