నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం ``అఖండ`. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. `లెజెండ్` తరువాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక సతమతమవుతున్న బాలయ్య ఎట్టకేలకు `అఖండ` చిత్రంతో అఖండమైన విజయాన్ని సోంతం చేసుకున్నారు. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లతో తెలుగు సినిమాకు సరికొత్త ఊపొచ్చింది. టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ గా వున్న చిత్రాలకు ధైర్యమొచ్చింది.
బాలయ్య - బోయపాటి శ్రీనుల కలయికలో ముచ్చటగా మూడవసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ అక్కడ విజయాన్ని సాధించి అప్పుడే వంద కోట్ల మార్కుని దాటేసింది. `పుష్ప` విడుదలై బాక్సాఫీస్ వద్ద గటటి పోటీగా నిలిచినా `అఖండ` ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో `అఖండ` బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ కు మాత్రం ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయింది.
ఇందులో బాలయ్యకు జోడీగా చాలా మంది హీరోయిన్ లని పరిశీలించిన దర్శకడు చివరికి ప్రగ్యా జైస్వాల్ ని ఫైనల్ చేశారు. ఈ వార్త చాలా మందిని షాక్ కు గురిచేసింది. నయనతార తో చేయించాలనుకున్న ఈ పాత్రని ప్రగ్యాజైస్వాల్ తో చేయించడం ఏంటి అని ఫ్యాన్స్ కామెంట్ లు కూడా చేశారు. అయితే బోయపాటి ముందు కొంత మంది టాప్ హీరోయిన్ లని ఈ పాత్ర కోసం సంప్రదించారు కూడా. అందులో నయనతార కూడా ఒకరు. కానీ ఆమె డేట్స్ సమస్య తలెత్తడంతో ఈ సినిమాకు అంగీకరించలేదు. దాంతో ప్రగ్యా జైస్వాల్ నే ఫైనల్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇందులో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్‌గా కనిపించింది. ఇందులో బాలయ్య మురళీకృష్ణగానూ అఖండ గానూ రెండు పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. టైటిల్ పాత్రకు హీరోయిన్ వుండదు. రైతుగా మురళీకృష్ణ పాత్రలో నటించిన పాత్రకు జోడీగా ప్రగ్యా జోడీగా నటించింది. అయితే ఈ సినిమా వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదని తాజాగా తెలుస్తోంది. `అఖండ` బాలయ్య వన్ మ్యాన్ షో. ఇందులో నటించడానికి ప్రగ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు.
దీంతో `అఖండ` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ప్రగ్యాకు చెప్పుకోదగ్గ ఆఫర్ లు రావడం లేదు. `కంచె` మినహా ప్రగయా కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఆ తరువాత చేసిన ఏ సినిమా ఫలితం లేకపోవడంతో ఇక ప్రగ్యా కెరీర్ ముగిసినట్టే అన్న ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా `అఖండ`లో నటించే అవకాశం రావడం, సినిమా అఖంవడ విజయాన్ని సాధించడంతో ఆమె కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని అంతా భావించారు కానీ సినిమా భారీ సక్సెస్ ని సొంతం చేసుకున్నా ప్రగ్యాకు ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాకపోవడంతో ఆమెతో పాటు ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. `అఖండ`తో ప్రగ్యాకు దక్కింది ఏంటీ? అని వాపోతున్నారు.