ప్ర‌గ్యా హాట్ మంట‌లు చ‌ల్లారేదెలా?

Update: 2022-01-07 18:30 GMT
మ‌త్తెక్కించే చూపుల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. ఎట్ట‌కేల‌కు ప్ర‌గ్యాజైశ్వాల్ `అఖండ‌`తో తొలి క‌మ‌ర్శియ‌ల్  స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఐదారు సంవ‌త్స‌రాలు అయినా బ్యూటీకి ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన హిట్ ప‌డ‌లేదు. `కంచె`తో న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది గానీ..క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్  కాలేదు. ఆ తర్వాత న‌టించిన కొన్ని సినిమాలు ప్ర‌గ్యాని అంత‌గా ఫోక‌స్ చేయ‌లేదు. ఇలా డైలామాలో ఉన్న బ్యూటీని `అఖండ` స‌క్సెస్ ఒక్క‌సారిగా పైకి లేపింది. ఈ స‌క్సెస్ తో  ప్ర‌గ్యాకి బూస్టింగ్ దొరికిన‌ట్లు అయింది.

చిరంజీవి..వెంక‌టేష్..నాగర్జున లాంటి సీనియ‌ర్ హీరోల‌కు ప్ర‌గ్యా ఆప్ష‌న్ గా క‌నిపించే ఛాన్స్ ఉంది. క‌మ‌ర్శియ‌ల్  స‌క్సెస్  ఎలాగూ చేతిలో ఉంది కాబ‌ట్టి సీనియ‌ర్లు పిలిచి అవ‌కాశాలు ఇవ్వొచ్చు. ఇక సోష‌ల్ మీడియాలో ప్ర‌గ్యా ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో మంట‌లు రేపుతుంది. తాజాగా మ‌రోసారి  హాట్ ఫోటో తో ఇన్ స్టాని షేక్ చేస్తోంది. లో దుస్తులు పైన పొడ‌వైన ష‌ర్ట్  ధ‌రించి  శ‌రీర సౌష్ట‌వాన్ని ఎలివేట్ చేస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది. మ‌త్తెక్కించే చూపుల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

ఇక ప్ర‌గ్యా బాలీవుడ్  సినిమాల విష‌యానికి వ‌స్తే స‌ల్మాన్ ఖాన్ స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న `ది ఫైన‌ల్ ట్రూత్`  మరొ కొత్త ప్రాజెక్ట్ లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ రెండు చిత్రాలే ప్ర‌గ్యా చేతిలో ఉన్నాయి. కొత్త అవ‌కాశాలు కోసం సీరియ‌స్ గానే ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంది. కానీ టైమ్ క‌లిసి కార‌వ‌డం లేదు. అయితే టాలీవుడ్ పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి ప్ర‌గ్యా మ‌న‌సు తెలుగు సినిమాల‌పైనే ఉంది.
Tags:    

Similar News