అగ్గి రాజేస్తున్న ప్ర‌గ్య కొత్త లుక్

Update: 2022-10-04 17:19 GMT
కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌లి కాలంలో ఏ ఇత‌ర యువ‌నాయిక‌తో పోల్చినా ప్ర‌గ్య సోష‌ల్ మీడియాల్లో జెట్‌ స్పీడ్ గానే ఉంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల గుండెల్ని కొల్ల‌గొడుతోంది. ఇంత‌కుముందు మాల్దీవుల విహారం నుంచి బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. యూర‌ప్ చుట్టొచ్చిన‌ప్ప‌టి ఫోటోషూట్లు కూడా అంత‌ర్జాలంలో కి దూసుకొచ్చాయి.

ముంబైలో ప్ర‌గ్య స్నేహాలు పార్టీలు వ‌గైరా వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ప్ర‌గ్య షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ప్ర‌గ్య త‌న‌దైన స్మైలీ లుక్ తో వైట్ ఫ్రాక్ లో అద్భుత భంగిమ‌ల‌ను ఆవిష్క‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి. ప్ర‌గ్య స్మైల్.. టోన్డ్ మిల్కీ బాడీ బోయ్స్ లో హీట్ పెంచుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ భామ‌కు టాలీవుడ్ లో స‌రైన ఆఫ‌ర్లు లేవు. బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న న‌టించినా కానీ అది త‌న కెరీర్ కి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ఇప్ప‌టికీ బాలీవుడ్ పై హోప్స్ తో ఉంది. కానీ ఆశించిన ఛాన్సులేవీ లేవు.

వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `కంచె` లాంటి హిట్ సినిమాలో న‌టించిన ప్ర‌గ్య‌కు ఆ త‌ర్వాత స‌రైన ఆఫ‌ర్లు రాలేదు. ఎంత‌గా ప్ర‌య‌త్నించినా టాలీవుడ్ లో ఏదీ క‌లిసి రాలేదు. పాపులారిటీ లేని హీరోల స‌ర‌స‌న న‌టించ‌డం కూడా ఈ అమ్మ‌డి కెరీర్ కి పెద్ద మైన‌స్ అయ్యింది. ఇటీవ‌లే బాల‌య్య స‌ర‌స‌న అఖండ‌లో న‌టించి హిట్టందుకుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన స‌న్నాఫ్ ఇండియా త‌న‌కు కెరీర్ లో మ‌రో ఫ్లాప్ గా మిగిలింది. ప్ర‌గ్య ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓ స‌రైన అవ‌కాశం కోసం వేచి చూస్తోంది.

స్టార్ డైరెక్ట‌ర్ రిఫ‌రెన్స్ లు క‌లిసి రాలేదు

ప్ర‌గ్య జైశ్వాల్ కెరీర్ జ‌ర్నీలో త‌న‌కు స‌హ‌క‌రించిన ద‌ర్శ‌కులు హీరోలు ఉన్నారు. ఇలాంటి రిఫ‌రెన్సుల‌తో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు వ‌చ్చినా కానీ ఏవీ హిట్లు కాక‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. టాలీవుడ్ లో ప్ర‌ముఖ‌ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌గ్య‌కు రిఫ‌రెన్సులు ఇచ్చినా కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ప్ర‌గ్య కెరీర్ ఇప్ప‌టికి డైల‌మాలోనే ఉంది. సామాజిక మాధ్య‌మాల్లో త‌న‌ని తాను యాక్టివ్ గా ప్ర‌మోట్ చేసుకుంటోంది. త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించి అవ‌కాశాలొస్తాయేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News