బ్యాలెన్స్ యోగాలో టిప్స్ కావాలంటే

Update: 2019-12-17 01:30 GMT
గాల్లో ప్లేన్ లేచిన‌ట్టుగా.. స‌ర్పం తీగ‌కు చుట్టిన‌ట్టుగా.. ఆ యోగాస‌నం పేరు ఏమిటో కానీ ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో ప్ర‌గ్య జైశ్వాల్ ఇచ్చిన ఫోజులు యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ టు టాలీవుడ్ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో మైమ‌రిపిస్తున్న ముద్దుగుమ్మ‌ల్లో ప్ర‌గ్య జైశ్వాల్ పేరు టాప్ 10లో ఉంటుంది.

ఈ భామ సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ గా ఫిట్ నెస్ శిక్ష‌ణ‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల వీడియోలు- ఫోటోల్ని అభిమానుల‌తో షేర్ చేస్తోంది. తాజాగా ప్ర‌గ్య యోగాస‌నాల‌కు సంబంధించిన ఫోటోల్ని విరివిగా షేర్ చేసింది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో యోగా ఫీట్స్ వేస్తూ ప్ర‌గ్య మంట‌లు పుట్టించింది. దీనిని బ్యాలెన్స్ యోగ అంటూ కొత్త భాష్యం చెప్పింది. ఇక యోగాలో బ్యాలెన్స్ ప్రాధాన్య‌త‌ను కూడా విడ‌మ‌ర్చి చెప్పింది. నిజ‌మే ఆ ఫీట్స్ చూస్తుంటే అదుపుత‌ప్ప‌కుండా బ్యాలెన్స్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో అర్థ‌మ‌వుతూనే ఉంది. తేడాలొస్తే క‌ష్ట‌మే. అర‌నిమిషం చేసినా ఇలాంటి యోగా మంచి ఫ‌లితాల్నే ఇస్తుంది.

సీనియ‌ర్లు శిల్పా శెట్టి.. మ‌లైకా అరోరాఖాన్.. క‌రీనాక‌పూర్.. క‌త్రిన .. వీళ్ల‌కు ధీటుగా ఈ ముంబై భామ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తూ కుర్రకారులో నిరంత‌రం హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ శ్ర‌మ చూశాక అయినా మ‌న ద‌ర్శ‌కనిర్మాత‌లు త‌న‌కు ఛాన్సులివ్వ‌డం లేదు ఎందుక‌నో. క‌థానాయిక‌గా అవ‌కాశం స‌రే కానీ.. క‌నీసం ఐటెమ్ భామ‌గా అయినా ఛాన్సులు అందుకోలేక‌పోతోంది. ఇక యువ‌త‌రం ద‌ర్శ‌కనిర్మాత‌లు సైతం ప్ర‌గ్య‌కు అవ‌కాశాలిచ్చే ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డంతో రేసులో వెన‌క‌బ‌డింది. క‌నీసం ఇప్ప‌టికి అయినా ప్ర‌గ్య అదిరిపోయే హాట్ అప్ డేట్ తో అభిమానులకు శుభ‌వార్త చెబుతుందేమో చూడాలి.


Tags:    

Similar News