రాఘవేంద్రరావు కొడుకు, కోడలు ఎలా కలిశారు?

Update: 2015-11-23 07:30 GMT
సినీ రంగంలో పెద్ద ఫ్యామిలీలకు చెందిన పిల్లల పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి పెళ్లి మాత్రం చాలా సింపుల్‌ గా అయిపోయింది. తెలుగునాట ఎవరో ఒక బిగ్ షాట్ ఫ్యామిలీతో సంబంధం కలుపుకుంటారనుకుంటే.. ముంబయికి చెందిన కనికను పెళ్లాడాడు ప్రకాష్. రాఘవేంద్రరావుకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందని.. అప్పట్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కనికతో ప్రకాష్ లవ్ స్టోరీ సంగతి ఎవరికీ అంతు బట్టలేదు. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన పెళ్లి సంగతులు వివరించాడు ప్రకాష్.

‘‘దర్శకుడిగా ఓ టీంతో పాటు నాకు ఓ చిన్న యానిమేషన్ బృందం కూడా ఉంది. మేమంతా షారుఖ్ ఖాన్ ఐపీఎల్ జట్టు నైట్ రైడర్స్ కోసం ఓ యానిమేషన్ వీడియో చేయడానికి వెళ్లాం. షారుఖ్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లో కనిక క్రియేటివ్ హెడ్ గా పని చేసేది. మా ప్రాజెక్టుకు సంబంధించి తనతో చాలాసార్లు మాట్లాడేవాణ్ని. ఆ క్రమంలో మా ఇద్దరి ఆలోచనలు ఒకటే అని అర్థమైంది. చాలా విషయాల్లో ఒకేలా ఆలోచించేవాళ్లం. ఇలా ఆలోచనలతో పాట మనసులూ కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తనతో పెళ్లికి మా కుటుంబమంతా సంతోషంగా అంగీకరించింది. ఐతే పెళ్లి సింపుల్ గా చేసుకున్నాం. ఓం శాంతి ఓం - రా.వన్ - బిల్లూ బార్బర్ సినిమాలకు కనిక స్క్రీన్ ప్లే రచయితగా - స్క్రిప్ట్ సూపర్ వైజర్ గా - డైలాగ్ రైటర్ గా వివిధ విభాగాల్లో పని చేసింది. రెండు ఇంగ్లిష్ నవలలూ రాసింది. తను రాసిన కథతోనే సైజ్ జీరో సినిమా చేస్తున్నా’’ అన్నాడు ప్రకాష్.
Tags:    

Similar News